Uttam Kumar Reddy: ముఖ్యమంత్రి పరిశీలనలో నేను కూడా ఉంటానంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. మొదటి నుంచి నేను కాంగ్రెస్ లోనే ఉన్నాను. నాకు సీఎం అయ్యే అన్ని అర్హతలు ఉన్నాయి అని చెప్పారు ఉత్తమ్. నా వాదన, అభిప్రాయం హై కమాండ్ కు చెప్పాను అయితే వారి అభిప్రాయం వారు చెపుతారని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ హై కమాండ్ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని ఉత్తమ్ స్పష్టం చేశారు. సీఎం ఎంపిక విషయంలో ప్రజాస్వామ్య పద్ధతిని అవలంబిస్తున్నాం. ఎక్కడ కూడా ఎటువంటి గందర గోళం లేదు.నేను గతంలో మిలటరీ లో సోల్జర్ గా పని చేశాను. అలాగే కాంగ్రెస్లోనూ సోల్జర్ నని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ లో 7 సార్లు గెలిచాను. నాకు శక్తి ఉన్నంతవరకు కాంగ్రెస్ పార్టీ బలపడడానికి ప్రయత్నం చేశాను. 35 సంవత్సరాలు గా కాంగ్రెస్ లోనే ఉన్న. గతం లో నేను పీసీసీ అధ్యక్షుడిగా పని చేశాను.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో క్యాబినెట్ మంత్రిగా కూడా పని చేశాను. సీఎం అభ్యర్థి ఎంపికలో నన్ను కూడా పరిశీలిస్తారని ఆశిస్తున్నానని అన్నారు. అయితే సీఎం ఎంపిక ఆలస్యం అవుతుందన్న కామెంట్స్ పై ఉత్తమ్ మాట్లాడారు. సీఎం ఎంపికలో ఎలాంటి తాత్సారం జరగలేదు. ఫలితాలు వచ్చి 48 గంటలు కూడా దాటలేదు.. విధేయత, ట్రాక్ రికార్డ్, సొంత ఇమేజీ వంటి అన్ని అంశాలు పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ పర్ఫెక్ట్ ప్రాసెస్ ఫాలో అయిందన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. కాంగ్రెస్ కు 70 నుంచి 72 సీట్లు వస్తాయని ఆశించాను. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం సంతోషంగా ఉందని చెప్పారు ఉత్తమ్.
Also Read: Teeth : మీ దంతాలు ఊడిపోయినట్టు కల వచ్చిందా.. అయితే అది దేనికి సంకేతమో తెలుసా?