Site icon HashtagU Telugu

KCR : కేసీఆర్ లో భయం మొదలైంది – ఉత్తమ్

Uttam Kumar

Uttam Kumar

కేసీఆర్ (KCR) లో భయం మొదలైందని, అందుకే ఆ భయం తో ఏమాట్లాడుతున్నారో కూడా అర్ధం కావడం లేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో లోక్ సభ ఎన్నికల వేడి మొదలైంది. అసెంబ్లీ ఎన్నికల ఓటమి నుండి బయటకు వచ్చిన కేసీఆర్..లోక్ సభ ఎన్నికల్లో విజయం సాధించి మళ్లీ పట్టు బిగించాలని చూస్తున్నారు. ఈ క్రమంలో నిన్న సూర్యాపేట , నల్గొండ పలు జిల్లాలో పర్యటించి ఎండిన పంట తీరు ఫై రైతులతో మాట్లాడారు. అనంతరం ప్రెస్ మీట్ లో కాంగ్రెస్ ప్రభుత్వం ఫై పలు కీలక వ్యాఖ్యలు చేసారు.

We’re now on WhatsApp. Click to Join.

ఈ వ్యాఖ్యలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు. కేసీఆర్ డిప్రెషన్, ఫ్రస్ట్రేషన్‌లో ఉన్నారని , పార్టీ మిగలదనే భయం ఆయనలో మొదలైందని ఉత్తమ్ విమర్శించారు. బీఆర్​ఎస్​ జాతీయ పార్టీ అన్నారని, కానీ ఇంత తొందరగా ఏ పార్టీ కుప్ప కూలలేదని ఎద్దేవా చేశారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ మిగలదని, కేసీఆర్ కుటుంబసభ్యులు తప్ప బిఆర్ఎస్ ఎవరూ మిగలరని ఉత్తమ్‌ జోస్యం చెప్పారు.

అసలు కేసీఆర్‌కు ఇరిగేషన్‌పై మాట్లాడే అర్హత ఉందా? అని ప్రశ్నించారు. కేసీఆర్‌ నీటి పారుదల రంగాన్ని సర్వనాశనం చేశారు. కమీషన్ల కోసం ప్లాన్‌, డిజైన్లు లేకుండా ప్రాజెక్టులు నిర్మించారని, కాళేశ్వరం గురించి కేసీఆర్‌ మాట్లాడేందుకు సిగ్గుపడాలి అని ఉత్తమ్ పేర్కొన్నారు. ఇక నల్గొండ పార్లమెంట్‌లో బీఆర్ఎస్ (BRS), బీజేపీ (BJP)లకు డిపాజిట్ (Deposit) కూడా రాదన్నారు. 14 ఎంపీ సీట్లు తప్పకుండా గెలుస్తామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్నికల కోడ్ (Election Code) తర్వాత అర్హులైన వారికి తెల్ల రేషన్ కార్డులు (White Ration Cards) ఇస్తామని స్పష్టం చేశారు.

Read Also : KTR: చేసింది చెప్పకపోవడమే మా తప్పు: కేటీఆర్