Site icon HashtagU Telugu

Uttam Kumar: బొగ్గు గనుల ప్రయివేటీకరణపై పార్లమెంట్ లో ఉత్తమ్ ప్రసంగం

Screen Shot 2021 12 01 At 8.11.31 Pm Imresizer

uttam kumar reddy

మొన్నటి దాకా తెలంగాణలో వరిధాన్యం సమస్య హాట్ టాపిక్ గా ఉండింది. తాజాగా బొగ్గు గనుల ప్రయివేటీకరణ అంశం టాక్ ఆఫ్ ది స్టేట్ గా మారుతోంది. తెలంగాణ లోని నాలుగు బొగ్గు గనులను ప్రైవేట్ పరం చేసేందుకు కేంద్ర బొగ్గు గనుల శాఖ ప్రయత్నం చేస్తోంది. దీనిపై బీజేపీ మినహా మిగతా పార్టీలతో సహా తెలంగాణలోని ప్రజాసంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.

లోక్ సభలో ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ అంశంపై కాంగ్రెస్ పార్టీ స్టాండ్ తెలిపారు. తెలంగాణ ప్రజలు బొగ్గు గనుల ప్రైవేటీకరణ ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, ఈ నిర్ణయాన్ని వెంటనే విరమించుకోవాలని ఆయన డిమాండ్ చేసారు.

కొత్తగూడెం బ్లాక్, సత్తుపల్లి బ్లాక్, శ్రావణ పల్లి బ్లాక్, కల్యాణ ఖని బ్లాక్ లను ప్రైవేట్ పరం చేసేందుకు బీజేపీ ప్రయత్నం చేస్తోందని,
వందేళ్ల చరిత్ర కలిగిన సింగరేణి బొగ్గు గనులు ప్రైవేట్ పరం చేయడం పట్ల అక్కడ ఉద్యోగులు సమ్మె చేస్తున్నారని ఉత్తమ్ పార్లమెంట్ లో తెలిపారు. సింగరేణి బొగ్గు మీద ఆధారపడి తెలంగాణ, ఆంధ్ర, మహారాష్ట్ర తదితర రాష్ట్రాలలో థర్మల్ బొగ్గు ఉత్పత్తి అవుతోందని, కార్మికుల, దేశ ప్రయోజనాలను పక్కన పెట్టి కేంద్రం తీసుకొంటున్న నిర్ణయం జాతి ప్రయోజనాలకు వ్యతిరేకమని ఆయన ప్రకటించారు. నాలుగు బొగ్గు ఉత్పత్తి బ్లాక్ ల ప్రైవేటీకరణ ను ఉపసంహరించుకునేంత వరకు కాంగ్రెస్ పోరాడుతుందని ఉత్తమ్ తెలిపారు.