Uttam Kumar Reddy : ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి కి మంత్రి ఉత్తమ్ స్ట్రాంగ్ కౌంటర్..

ఇక, బీజేపీ ఫ్లోర్ లీడర్ పదవి కోసం ఆయనే ఢిల్లీకి డబ్బులు పంపినట్టు ఉన్నారని అన్నారు. తాను వెయ్యి కోట్లు తీసుకున్నానని మాట్లాడుతున్నారు, కానీ నేను ఎవరి దగ్గర నయా పైసా కూడా తీసుకోలేదని స్పష్టం చేశారు.

Published By: HashtagU Telugu Desk
Uttam Mahesh

Uttam Mahesh

మొన్నటి వరకు తెలంగాణ ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారంటూ సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యంగా చేసుకొని తీవ్ర ఆరోపణలు చేసిన మహేశ్వర్ రెడ్డి .. తాజాగా మంత్రి ఉత్తమ్‌ కుమార్ రెడ్డి ఫై విరుచుకపడ్డారు. రాష్ట్రంలో మంత్రి ఉత్తమ్ ‘యూ ట్యాక్స్’ వసూళ్లకు పాల్పడుతున్నారంటూ ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై ఉత్తమ్ కౌంటర్ ఇచ్చారు.

We’re now on WhatsApp. Click to Join.

ఆదివారం గాంధీభవన్‌లో ఉత్తమ్ మీడియాతో మాట్లాడుతూ.. వినతిపత్రాలు తీసుకొచ్చి సీఎం దగ్గరికి పోయి.. లోపలికి వెళ్లాక ల్యాండ్ సెటిల్‌మెంట్ విషయాలు మాట్లాడినట్లు కాదని మహేశ్వర్ రెడ్డికి కౌంటర్ ఇచ్చారు. ఇటీవల ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి సచివాలయానికి వెళ్లి సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన విషయం తెలిసిందే. ఇక, బీజేపీ ఫ్లోర్ లీడర్ పదవి కోసం ఆయనే ఢిల్లీకి డబ్బులు పంపినట్టు ఉన్నారని అన్నారు. తాను వెయ్యి కోట్లు తీసుకున్నానని మాట్లాడుతున్నారు, కానీ నేను ఎవరి దగ్గర నయా పైసా కూడా తీసుకోలేదని స్పష్టం చేశారు.

తనపై నిరాధారణ ఆరోపణలు చేస్తున్నారని, ఇప్పటికైనా ఇలాంటి నీచపు మాటలు మానుకోవాలని చురకలంటించారు. ఢిల్లీకి డబ్బులు పంపించే సంస్కృతి బీజేపీకి ఉందని ఘాటుగా రియాక్ట్ అయ్యారు. బీఆర్ఎస్, బీజేపీ మాటల్లో నిజం లేదని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి పచ్చి అబద్ధాలు ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read Also : Hyderabad : ఒక్కసారిగా హైదరాబాద్లో మారిన వాతావరణం

  Last Updated: 26 May 2024, 05:19 PM IST