Site icon HashtagU Telugu

Lok Sabha Elections : కాంగ్రెస్ పార్టీకి బిఆర్ఎస్ అసలు పోటీనే కాదు – ఉత్తమ్

Uttam Gas

Uttam Gas

లోక్ సభ ఎన్నికల్లో (Lok Sabha Elections) కాంగ్రెస్ పార్టీ (Congress)కి అసలు బిఆర్ఎస్ (BRS) పోటీనే కాదంటూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) కీలక వ్యాఖ్యలు చేసారు. ప్రస్తుతం తెలంగాణ లో లోక్ సభ ఎన్నికల హోరు రోజు రోజుకు తారాస్థాయికి చేరుతుంది. ఎవరికీ వారు గెలుపు ఫై ధీమా వ్యక్తం చేస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో విజయ డంఖా మోగించడం..రాష్ట్రంలో కాంగ్రెస్ గాలి గట్టి గా వీస్తుండడం.,..ఇతర పార్టీల నుండి పెద్ద ఎత్తున ప్రతి రోజు కాంగ్రెస్ లో చేరుతుండడంతో కాంగ్రెస్ కు తిరుగులేదని అంత భావిస్తున్నారు.

మరోపక్క కేంద్రంలో మూడోసారి బిజెపినే గెలవబోతుందని..తెలంగాణ లో కూడా ఎక్కువ సంఖ్యలో స్థానాలు బిజెపినే గెలుచుకోబోతుందని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇటు అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూసిన బిఆర్ఎస్..ఈ లోక్ సభ ఎన్నికల్లో సత్తా చాటాలని చూస్తుంది. ఈ క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఫై విమర్శలు చేస్తూ..ప్రజల్లోకి వెళ్తుంది.

We’re now on WhatsApp. Click to Join.

ఇలా బిజెపి , బిఆర్ఎస్ పార్టీల నేతలు ఉంటె..ఇక తాజాగా కాంగ్రెస్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ..త్వరలో జరగబోయే లోక్ సభ ఎన్నికల్లో బిఆర్ఎస్ మాతో పోటీనే కాదంటూ కీలక వ్యాఖ్యలు చేసారు. అసలు రాష్ట్రంలో బిఆర్ఎస్ ను పట్టించుకునే నాథుడే కరువయ్యాడని ఉత్తమ్ అన్నారు.

ఒకవేళ బీజేపీ మళ్లీ గెలిస్తే.. ప్రజాస్వామ్య వ్యవస్థకు బీజేపీ ప్రమాదకరంగా మారుతుందన్నారు. రైతులకు రూ.2 లక్షల రుణ మాఫీ విషయంలో కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని, దానిపై బీజేపీ రాజకీయం చేస్తూ నాటకాలు ఆడుతోందని, వారి మాటలను ఎవరూ విశ్వసించరని తెలిపారు. రాజకీయంగా కారు పార్టీ ఇప్పటికే కుదేలైందని.. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో టీంగా పని చేస్తోందని చెప్పుకొచ్చారు.

Read Also : Lok Sabha Elections 2024 : మెదక్ సభలో సీఎం రేవంత్ ఫై కేసీఆర్ సంచలన ఆరోపణలు