Site icon HashtagU Telugu

Harish Rao: ఉత్తం గడ్డం తీయలేదు, రేవంత్ రాజకీయం సన్యాసం తీసుకోలేదు: మంత్రి హరీశ్ రావు

Harish Rao

Harish Rao

Harish Rao: తెలంగాణ భవన్ లో బీ ఆర్ ఎస్ లో చేరిన కాంగ్రెస్ నేత నగేష్ ముదిరాజ్ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు మంత్రి హరీష్ రావు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. బీసీ ల పట్ల కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న తీరు గమనించాలని, బీసీలను విస్మరించింది కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ ద్రోహులతో కలిసింది కాంగ్రెస్ పార్టీ అని ఆయన అన్నారు. 2018 లో కూడా మహాకూటమి తో తెలంగాణ ద్రోహులతో చేతులు కలిపింది కాంగ్రెస్ అని, ఇప్పుడు అదే రీతిలో కలిశారని, కాంగ్రెస్ గెలవకపోతే ఉత్తమ్ గడ్డం తీయను, రేవంత్ గెలవకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంట అన్నడు. ఆయన గడ్డం తీయలేదు, ఈయన రాజకీయం సన్యాసం తీసుకోలేదు అని హరీశ్ రావు సెటైర్స్ వేశారు.

24 గంటల కరెంట్ ఇచ్చే రాష్ట్రంలో 5 గంటల కరెంట్ ఇస్తామని డీకే శివకుమార్ చెప్తున్నాడని, కాంగ్రెస్ నాయకులు గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని, ఎవరు ఎన్ని చెప్పినా కేసిఆర్,బీ ఆర్ ఎస్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని హరీశ్ రావు ధీమా వ్యక్తం చేశారు. ఒక్కసారి అవకాశం ఇవ్వండి అని కాంగ్రెస్ నేతలు అడుగుతున్నారని, ఇస్తే మనం మళ్ళీ ఆగమేనని అన్నారు.

పక్క రాష్ట్ర రజినీ వచ్చి అభివ్రుది బాగుంది అన్నారు. కానీ ఇక్కడ ఉన్న గజినీలకు అర్థం కావడం లేదు అని, అన్ని బాగున్నపుడు ఎందుకు రిస్క్ తీసుకోవాలి. ఒక్కొకటి సమస్య కేసీఆర్ తీర్చుతున్నాని పేర్కొన్నారు. రైతు బంధు పడుతుండగా, రైతు బీమా వస్తుండగా, కళ్యాణ లక్ష్మి ఇస్తుండగా, 24 కరెంట్ ఉండగా, పింఛన్లు ఇస్తుండగా రిస్క్ తెచ్చుకోవడం ఎందుకు? అని హరీశ్ రావు ప్రశ్నించారు.