US Warns: తెలంగాణ‌కు వెళ్లొద్ద‌ని పౌరుల‌కు అమెరికా అలెర్ట్‌

ఉత్త‌ర తెలంగాణ ప్రాంతాల‌కు వెళ్లొద్ద‌ని పౌరుల‌కు అమెరికా ఆదేశాల‌ను జారీ చేసింది. మావోయిస్టు, ఉగ్ర‌వాద క‌ద‌లిక‌ల‌ను గుర్తించిన

  • Written By:
  • Updated On - October 8, 2022 / 02:54 PM IST

ఉత్త‌ర తెలంగాణ ప్రాంతాల‌కు వెళ్లొద్ద‌ని పౌరుల‌కు అమెరికా ఆదేశాల‌ను జారీ చేసింది. మావోయిస్టు, ఉగ్ర‌వాద క‌ద‌లిక‌ల‌ను గుర్తించిన అమెరికా ఆ మేర‌కు అప్ర‌మ‌త్తం చేసింది. మావోయిస్ట్ తీవ్రవాద గ్రూపులు తూర్పు మహారాష్ట్ర, ఉత్తర తెలంగాణ నుంచి పశ్చిమ బెంగాల్ మీదుగా ఛత్తీస్‌గఢ్ , జార్ఖండ్‌లోని గ్రామీణ ప్రాంతాలలో ఉన్నార‌ని గుర్తించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ స‌రిహ‌ద్దుల్లో చురుకుగా ఉన్నారని యుఎస్ సూచ‌న చేసింది.

మధ్య మరియు తూర్పు భారతదేశం ప్రాంతాల్లో ప్ర‌యాణాల‌ను చేయొద్ద‌ని పౌరుల‌కు అమెరికా సలహా ఇచ్చింది. హైదరాబాద్ నగర పోలీసులు పాకిస్తాన్‌కు చెందిన లస్కర్-ఎ-తోయిబాతో ముడిపడి ఉన్న ఉగ్రవాద మూలాల‌ను విఛ్చిన్నం చేసిన చేసిన అంశాన్ని ప్ర‌స్తావించింది. ఇండియా ట్రావెల్ అడ్వైజరీ స్థాయిని ఒకటి నుండి 4 స్కేల్‌లో 2కి తగ్గించింది. రెండోది అత్యధికంగా స్టేట్ డిపార్ట్‌మెంట్ ప్ర‌క‌టించింది.

ఉగ్ర‌వాద కార్య‌క‌లాపాల్లో ముగ్గురు హైదరాబాద్ కు చెందిన స్థానికులు ఉన్నారు. వాళ్లు పాకిస్థాన్‌లోని ఐఎస్‌ఐ హ్యాండ్లర్‌లతో టచ్‌లో ఉన్నారు. పేలుడు పదార్థాలను ఉపయోగించి పెద్ద సమూహాలు, బహిరంగ ప్రదేశాలు, ముఖ్యమైన కూడ‌ళ్ల‌లో పేలుడుకు స్కెచ్ వేశార‌ని అమెరికా అనుమానిస్తోంది. హైదరాబాద్‌తో పాటు దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఉగ్ర‌వాదుల క‌ద‌లిక‌ల‌ను ట్రాక్ చేయడానికి హై అలర్ట్ ప్రకటించారు. అరెస్టయిన ముగ్గురి ఉగ్ర‌వాదుల పరిచయాలు, సహచరులపై నిఘా కొనసాగుతుందని పోలీసులు పేర్కొన్నారు. ఇది సాధారణ హెచ్చరిక గా ప‌రిగ‌ణించాల‌ని చెబుతూ ప్రస్తుతానికి భయపడాల్సిన పని లేదని సీనియర్ పోలీసు అధికారులు తెలిపారు.

తూర్పు మహారాష్ట్ర , ఉత్తర తెలంగాణ నుంచి పశ్చిమ బెంగాల్ మీదుగా గ్రామీణ ప్రాంతాల్లోని US పౌరులకు అత్యవసర సేవలను అందించడానికి US ప్రభుత్వానికి పరిమిత సామర్థ్యం ఉంది. ముప్పు పొంచి ఉన్న కార‌ణంగా నక్సలైట్ కార్యకలాపాలు ఉన్న రాష్ట్రాలకు వెళ్లే పౌరులు US కాన్సులేట్ నుండి ప్రత్యేక అధికారాన్ని పొందాలని అమెరికా స‌ల‌హా ఇచ్చింది. తీవ్రవాదం మరియు పౌర అశాంతి కారణంగా జమ్మూ మరియు కాశ్మీర్‌కు వెళ్లవద్దని మరియు సాయుధ పోరాటానికి అవకాశం ఉన్నందున భారతదేశం-పాకిస్తాన్ సరిహద్దుకు 10 కి.మీ. దూరంగా ఉండాల‌ని పౌరుల‌కు అమెరికా జాగ్ర‌త్త‌లు చెబుతోంది.