Telangana Congress: కాంగ్రెస్ అత్యవసర భేటీ..రెండో జాబితాపై నిర్ణయం

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన కార్యాచరణపై తెలంగాణ స్క్రీనింగ్ కమిటీ చైర్మన్, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి మురళీధరన్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలతో కేసీ వేణుగోపాల్ నివాసంలో అత్యవసరంగా సమావేశమయ్యారు

Published By: HashtagU Telugu Desk
Telangana Congress (2)

Telangana Congress (2)

Telangana Congress: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన కార్యాచరణపై తెలంగాణ స్క్రీనింగ్ కమిటీ చైర్మన్, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి మురళీధరన్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలతో కేసీ వేణుగోపాల్ నివాసంలో అత్యవసరంగా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రేవంత్ రెడ్డి, మాణిక్ రావ్ ఠాక్రే, ఉత్తమ్ కుమార్, భట్టి విక్రమార్క మరికాసేపట్లో సమావేశానికి హాజరుకానున్నారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉంది. ఈ సమావేశంలో ప్రధానంగా కాంగ్రెస్ అసెంబ్లీ అభ్యర్థుల రెండో జాబితాను విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. సీపీఎం పార్టీలతో చర్చలు జరుపుతోంది. ఈరోజు రాత్రి లేదా రేపు ఉదయం మిగిలిన అభ్యర్థులను ఏఐసీసీ ప్రకటించనుంది. తొలి దశలో 55 మంది అభ్యర్థుల పేర్లను ఏఐసీసీ విడుదల చేసింది. వామపక్షాల పొత్తుపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Also Read: Gaddar Daughter Vennela : కాంగ్రెస్ టికెట్ ఫై గద్దర్ కూతురు కీలక వ్యాఖ్యలు

  Last Updated: 21 Oct 2023, 05:53 PM IST