Site icon HashtagU Telugu

Urea Shortage Telangana : కాంగ్రెస్ పాలనలో యూరియా బంగారమైంది – హరీశ్ రావు

Urea Shortage Telangana Har

Urea Shortage Telangana Har

తెలంగాణలో రైతులు ఎదుర్కొంటున్న యూరియా కొరతపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్ రావు (Harishrao) తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలంలో యూరియా కోసం రైతులు పడుతున్న ఇబ్బందులను ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. యూరియా కోసం రైతులు పడిగాపులు పడుతున్నారని, గంటల తరబడి క్యూలైన్లలో నిలబడి ఎదురుచూస్తున్నారని ఆయన తెలిపారు. ఈ పరిస్థితికి కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలే కారణమని ఆరోపించారు.

Sarpanch Elections: స‌ర్పంచ్ ఎన్నిక‌ల‌పై రేవంత్ స‌ర్కార్‌ కీల‌క ప్ర‌క‌ట‌న‌!

రాయపోల్ మండలంలో యూరియా కోసం రైతులు తమ చెప్పులను క్యూలైన్లో పెట్టి వేచి చూస్తున్న దృశ్యం తీవ్ర ఆవేదనకు గురిచేసింది. దీనికి సంబంధించిన వీడియోను హరీశ్ రావు సోషల్ మీడియాలో పోస్ట్ చేసి కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. “కాంగ్రెస్ పాలనలో ‘తులం బంగారం దేవుడెరుగు. యూరియా బంగారంగా మారింది’ ” అని ఎద్దేవా చేశారు. ప్రజలకు మెరుగైన పాలన అందిస్తామని చెప్పిన కాంగ్రెస్, కనీసం రైతులకు అవసరమైన యూరియాను కూడా సమకూర్చలేకపోతుందని ఆయన విమర్శించారు.

Kitchen Cleaning Tips: మీ ఇంట్లో కిచెన్‌ను చాలా సుల‌భంగా శుభ్రం చేసుకోండి ఇలా!?

“పేరు గొప్ప ఊరు దిబ్బ. ఇదే కాంగ్రెస్ మార్క్ ప్రజా పాలన” అంటూ హరీశ్ రావు ఘాటుగా స్పందించారు. రైతులకు అవసరమైన ఎరువులను సరైన సమయంలో అందించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన పేర్కొన్నారు. యూరియా కొరత కారణంగా పంటలు దెబ్బతినే ప్రమాదం ఉందని, తక్షణమే ప్రభుత్వం స్పందించి రైతులకు యూరియాను అందుబాటులోకి తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు. రైతుల ఇబ్బందులను పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని హరీశ్ రావు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.