Site icon HashtagU Telugu

Power Cut: ఉప్పల్ స్టేడియానికి కరెంట్ కట్… ఎందుకో తెలుసా?

uppal stadium

uppal stadium

హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియానికి విద్యుత్ సరఫరా నిలిపివేశారు. ఎన్నో ఇంపార్టెంట్ మ్యాచులకు వేదికైన ఈ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియానికి సంబందించిన కరెంట్ బిల్లులు చాలాకాలంగా పెండింగ్ లో ఉండడం వల్ల ఎలక్ట్రిసిటీ అధికారులు స్టేడియానికి కరెంట్ సరఫరా ఆపేసినట్లు తెలుస్తోంది.

గత మూడేళ్లుగా భారీగా విద్యుత్ బకాయిలు పేరుకొని పోవడంతో కోర్టు ఆదేశాల మేరకు విద్యుత్‌ కనెక్షన్ కట్ చేశారట. విద్యుత్ బిల్లులు చెల్లించాలని నోటీసులు ఇచ్చినా కూడా స్టేడియం అధికారుల నుండి ఎలాంటి స్పందనలేదని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. ఇప్పటివరకు ఉప్పల్ స్టేడియానికి సంబంధించి 3 కోట్ల రూపాయాల విద్యుత్ బకాయిలు పెండింగ్ లో ఉన్నాయట.విద్యుత్ బకాయిలు చెల్లించకుండా ఉండడమే కాకుండా అక్రమంగా విద్యుత్ ను ఉపయోగిస్తున్న కారణంగా ఉప్పల్ స్టేడియం యాజమాన్యంపై కేసు కూడా నమోదయ్యిందట.

గతకొద్దికాలంగా ఉప్పల్ స్టేడియంలోని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో వర్గపోరు, అంతర్గత కుమ్ములాటలు కొనసాగుతున్నాయి.పదవుల కోసం కొట్టుకోవడం తప్పా హెచ్‌సీఏకు అనుబంధంగా ఉన్న స్టేడియంలు, గ్రౌండ్‌లను అభివృద్ది చేయాలనే ప్రణాళిక లేకుండా పోయిందని తాజాగా స్టేడియానికి కరెంట్ కట్ అయ్యే దాకా చూస్తూ ఉండి స్టేడియం ప్రతిష్ట దిగజార్చారని క్రికెట్ అభిమానులు దుమ్మెత్తిపోస్తున్నారు.

ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో నిర్మించిన ఉప్పల్ స్టేడియంను గత కొన్నాళ్లుగా కనీసం పట్టించుకోవడం లేదు. దింతో
హైదరాబాద్‌కు కేటాయించాల్సిన పలు ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఇతర స్టేడియాలకు షిఫ్ట్ చేస్తున్నా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. అధికారుల అలసత్వంతో గత రెండేళ్లుగా ఈ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్‌లు కూడా జరగలేదు. వచ్చే సీజన్‌లో ఉప్పల్ స్టేడియంలో దాదాపు 10 మ్యాచ్‌లు జరిగే అవకాశముందట.
ఇప్పటికైనా అధికారులు ఈ సమస్యలపై స్పందిస్తారో పట్టించుకోకుండా మరింత నిర్వీర్యం చేస్తారో చూడాలి.