Site icon HashtagU Telugu

Telangana: కేసీఆర్‌కు ఝలక్ ఇచ్చిన బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే

Telangana (65)

Telangana (65)

Telangana: తెలంగాణ ఎన్నికల నోటిఫికేషన్ రెండు రోజుల్లో అంటే నవంబర్ 3న విడుదల కానుంది. ఇప్పటికే షెడ్యూల్ విడుదల చేయడంతో తెలంగాణలో ఉన్న ప్రధాన రాజకీయ పార్టీలు దూకుడు పెంచాయి. ఓటర్లని ప్రసన్నం చేసుకునేందుకు వ్యూహాలు రచిస్తున్నాయి. ఇప్పటికే ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించాయి. కాంగ్రెస్, బీజేపీ మరికొన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. మరోవైపు ప్రధాన పార్టీ నేతలంతా ప్రచారంలో దూసుకుపోతుండడంతో టికెట్ రాకపోవడంతో కలవరపడ్డ నేతలంతా ఆయా పార్టీల్లోకి జంప్ అవుతున్నారు.

తాజాగా ఉప్పల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే భేతి సుభాస్ రెడ్డి కూడా జంప్ చేస్తున్నారు. ఈసారి బీఆర్‌ఎస్‌ సోయి నుంచి టికెట్‌ కేటాయించకపోవడంతో అసంతృప్తితో ఉన్న ఆయన బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. బీజేపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. కాగా, ఉప్పల్ బీజేపీ అభ్యర్థిని ఇంకా ప్రకటించలేదు. ఈరోజు ఢిల్లీలో బీజేపీ అగ్రనేతల సమక్షంలో కాషాయ కండువా కప్పుకోనున్నారు. పార్టీలో చేరిన తర్వాత బీజేపీ అభ్యర్థిగా ఆయన అభ్యర్థిత్వాన్ని ప్రకటిస్తారా. ? లేదంటే గ్యారెంటీ ఉంటుందో వేచి చూడాలి. నామినేషన్ల గడువు ముగియకముందే తెలంగాణలో ఇంకా ఎన్ని పరిణామాలు చోటు చేసుకుంటాయో వేచి చూడాలి.

Also Read: Gill And Sara Tendulkar: అడ్డంగా దొరికిపోయిన శుభ్ మన్ గిల్, సారా టెండ్కూలర్, చక్కర్లు కొడుతున్న వీడియో!