Site icon HashtagU Telugu

UoH: జైభీమ్ సినిమా ప్రదర్శన నిలిపివేత

UoH

UoH

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ మరోసారి వార్తలకెక్కింది. ఇటీవల రిలీజైన జైభీమ్ సినిమాను యూనివర్సిటీలో ప్రదర్శించి, సినిమా తర్వాత ఆ సినిమాకి మూలకారణమైన ఒరిజినల్ హీరో జస్టిస్ చంద్రుతో విద్యార్థులు చర్చ కార్యక్రమం చేయాలనుకున్నారు.

యూనివర్సిటీలో సినిమా ప్రదర్శించడానికి యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ పర్మిషన్ ఇవ్వలేదు. దింతో విద్యార్థులు యూనివర్సిటీ మెయిన్ గెట్ వద్దకు వచ్చి నిరసన వ్యక్తం చేశారు.

కోవిడ్ నేపథ్యంలోనే సినిమా ప్రదర్శనకు పర్మిషన్ ఇవ్వలేదని యూనివర్శిటీ అధికారులు తెలిపారు. అధికారులు చెప్పిన సమాధానంపై విద్యార్థులు మండిపడ్డారు. కోవిడ్ కారణం చెప్పి తమ సభకు పర్మిషన్ రద్దుచేసిన యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ బయటి వ్యక్తులు మారథాన్ లాంటి ఈవెంట్స్ చేసుకోవటానికి పర్మిషన్ ఇవ్వడమేంటని నిలదీశారు.

యూనివర్సిటీలో ప్రజాస్వామిక వాతావరణాన్ని లేకుండా చేయాలని అడ్మినిస్ట్రేషన్ ప్రయత్నిస్తోందని యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ ఆరోపించింది. ప్రోగ్రెసివ్ విద్యార్థులు యూనివర్సిటీలో ఉంటే అడ్మినిస్ట్రేషన్ చేసే తప్పులను ప్రశ్నిస్తారనే భయంతోనే యూనివర్సిటీ అధికారులు విద్యార్థుల గొంతు నొక్కుతున్నారని ఇలాంటి చర్యలను కండిస్తున్నామని విద్యార్ధి సంఘాలు తెలిపాయి.

Exit mobile version