Site icon HashtagU Telugu

Unseasonal Rains: తెలంగాణ రైతులకు వాతావరణశాఖ హెచ్చరిక

Heavy Rains

Heavy Rains

Unseasonal Rains: రానున్న రెండు రోజుల్లో వాతావరణంలో మార్పులు చోటుచేసుకోనున్నాయి. దీని కారణంగా రాబోయే రెండు రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా పలు చోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని సమాచారం.ఈ నేపథ్యంలో రైతులు తమ పంటలను జాగ్రత్తగా కాపాడుకోవాలని సూచించింది వాతావరణశాఖ. రైతులు వేసిన వరి, మొక్కజొన్న, మామిడి తోపాటు ఇతర పంటలకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. కావున తమ పంటలను కాపాడుకునేందుకు ముందస్తుగా చర్యలు తీసుకోవాలని, రానున్న రెండ్రోజులు పరిస్థితులు అనుకూలంగా లేవని హెచ్చరించింది. విదర్భ నుంచి తెలంగాణ మీదుగా దక్షిణ తమిళనాడు వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోంది.

తెలంగాణాలో ఇప్పటికే పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. కరీంనగర్ జిల్లా చొప్పదండిలో ఈ సాయంత్రం భారీవడగళ్ల వాన కురిసింది. జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం బసిరెడ్డి పల్లె గ్రామంలో వడగళ్ల వర్షం పడింది. .

గత కొద్దిరోజులుగా తెలంగాణాలో ఎండలు దంచికొడుతున్నాయి. రెండు మూడ్రోజుల నుంచి ఉషోగ్రతలు మరింత పెరిగాయి. దీంతో ప్రజలు ఉక్కపోతకు గురవుతున్న పరిస్థితి. అయితే రాబోయే రెండు మూడు రోజులు ఉషోగ్రతలు పూర్తిగా పడిపోనున్నాయి. రానున్న రెండ్రోజులు రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు కాస్త తగ్గనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. పలుప్రాంతాల్లో 40 డిగ్రీల సెల్సియస్‌ కంటే తక్కువగా నమోదవుతాయని పేర్కొంది..తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ తెలిపింది. దీంతో ప్రజలు కొంత ఉపశమనం పొందే అవకాశముంది.

Read More: Vijayashanthi : రేవంత్ వర్సెస్ ఈటల.. ఇద్దరికీ ఇదే నా సలహా అంటూ మధ్యలో విజయశాంతి కామెంట్స్..