Site icon HashtagU Telugu

Bhainsa : కేటీఆర్ ఫై ఉల్లిగడ్డలు , టమాటాలతో దాడి

Ktr Binsa

Ktr Binsa

లోక్ సభ ఎన్నికల ప్రచారం (Lok Sabha Election Campaign)లో భాగంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) నిర్మల్ జిల్లా భైంసా (Bhainsa ) లో చేదు అనుభవం ఎదురైంది. ఆయన ప్రసంగిస్తుండగా.. కొంతమంది ఉల్లిగడ్డలు , టమాటాలు ఆయనపై విసిరారు. దీంతో కాసేపు ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. కేటీఆర్‌ ప్రసంగిస్తుండగా అడ్డుకోవడానికి ప్రయత్నించారు. బహిరంగంగానే దాడి జరుగుతున్నా పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని కేటీఆర్​ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన ప్రసంగం పూర్తైన తర్వాత పోలీసులు అందరినీ చెదరగొట్టారు. రాముడిని ఆరాధించే వారు ఎవరూ ఇలా ప్రవర్తించారని కేటీఆర్‌ మండిపడ్డారు.

We’re now on WhatsApp. Click to Join.

పట్టణంలోని పాత చెక్ పోస్ట్ కార్యాలయం సర్కిల్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ సమయంలో కొంతమంది కేటీఆర్‌కు వ్యతిరేకంగా ప్లకార్డులతో నిరసన తెలిపారు. వారంతా హనుమాన్ దీక్షలో ఉన్నారు. ‘హిందువులు ఆదర్శంగా భావించే శ్రీరాముడి జోలికి వస్తే ఊరుకునేది లేదు బిడ్డా… ఖబడ్దార్ కేటీఆర్’ అని ప్లకార్డులలో హెచ్చరించారు. అంతేకాదు, వారు కేటీఆర్ వాహనం వైపు వెళ్లే ప్రయత్నం చేశారు. పోలీసులు వారిని నిలువరించే ప్రయత్నం చేశారు. దీంతో ఉద్రిక్తత ఏర్పడింది. ఆ తర్వాత ఇంకొంతమంది ప్రచార వాహనం వైపు టమాటాలు, ఉల్లిగడ్డలు విసిరేశారు.

Read Also : AP Postal Voting : రికార్డు స్థాయిలో పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌..ఎవరికీ పడ్డాయో మరి..!!