Prahlad Joshi : కేసీఆర్ రాజకీయ భవిష్యత్తు ముగిసే సమయం దగ్గర్లోనే ఉంది..!!

  • Written By:
  • Updated On - November 17, 2022 / 05:50 PM IST

తెలంగాణ సీఎం కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషీ. గురువారం ఆయన యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహాస్వామిని దర్శించున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. త్వరలోనే సీఎం కేసీఆర్ రాజకీయ భవిష్యత్తు ముగిసిపోతుందని జోస్యం చెప్పారు. సింగరేణిలో రాష్ట్ర ప్రభుత్వం వాటా ఎక్కువగా ఉందన్న కేంద్రమంత్రి రాష్ట్ర వాటా కంటే తక్కువ కేంద్రం వాటా ఉన్నట్లు చెప్పారు. సింగరేణి గురించి ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అది రాష్ట్ర ప్రభుత్వంమే తీసుకోవాల్సి ఉంటుందన్నారు. సింగరేణిని ప్రైవేటీకరణ చేస్తుందని కేంద్రంపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అబద్దాలు చెబుతూ ప్రజలు నమ్మించడం ఇకనైనా మానుకోవాలంటూ హితవు పలికారు.

కాగా ఈ నెల 12న రామగుండం వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా నిరసన చేపట్టాయి కార్మిక సంఘాలు. సింగరేణిని ప్రైవేటీకరణ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం యత్నిస్తుందంటూ ఆందోళనకు దిగారు. అయితే ఈ విషయంపై మోదీ క్లారిటీ కూడా ఇచ్చారు. సింగరేణిని ప్రైవేటీకరణ చేయడం లేదని చెప్పారు. సింగరేణికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడం ప్రభుత్వానికే ఉంటుందన్నారు. ఈ విషయంలో కేంద్రానికి ఎలాంటి హక్కు లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వాటా ఎక్కువగా ఉంది కాబట్టి రాష్ట్రమే చూసుకుంటుందన్నారు. ఈ విషయంలో కార్మికులు, ప్రజలు గుర్తించాలని మోదీ తెలిపారు.