Site icon HashtagU Telugu

Finance Minister: కామారెడ్డి జిల్లా కలెక్టర్ పై కేంద్ర ఆర్థిక మంత్రి సీరియస్…!! అరగంటలో మా వాటఎంతో చెప్పాలి..!!

Nirmala Sitaraman

Nirmala Sitaraman

కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ కేంద్ర ఆర్థిక శాఖమంత్రి నిర్మలా సీతారామన్ మండిపడ్డారు. శుక్రవారం కామారెడ్డి జిల్లా బీర్కూర్ లోని రేషన్ షాప్ ను తనిఖీ చేశారామే. ఈ సందర్భంగా పేదలకు ఇచ్చే రేషన్ బియ్యంలో కేంద్రం వాటా, రాష్ట్ర వాటా ఎంతుంటుందని కలెక్టర్ ను ప్రశ్నించారు. తనకు తెలియదని సమాధానం ఇచ్చారు కలెక్టర్ జితేష్ పాటిల్. మీరు ఐఎఏస్ అధికారి…మీకు తెలియకుంటే ఎలా అంటూ ప్రశ్నించారు. అరగంట సమయం ఇస్తున్నానను తెలుసుకుని చెప్పమంటూ ఆదేశించారు.

ఇక అంతకుముందు బాన్సువాడలో కేంద్రమంత్రి కాన్వాయ్ ను యూత్ కాంగ్రెస్ నేతలు అడ్డుకున్నారు. దీంతో కాంగ్రెస్ బీజేపీ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. భారీగా మోహరించిన పోలీసులు వారిని చెదరగొట్టారు.