Site icon HashtagU Telugu

Kishan Reddy : వెయ్యి మంది కేసీఆర్ లు, ఓవైసీలు కలిసినా మోదీని ఏం….!!

7267kishanreddy Imresizer

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్రను అడ్డుకున్న ప్రయత్నం చేస్తున్నారని…అవసరమైతే జైలుకు వెళ్లేందుకు తాము సిద్ధంగా ఉన్నామని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. మంగళవారం భైంసాలో జరిగిన బీజేపీ బహిరంగసభలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్, తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పోలీసులను ప్రభుత్వం ఏజెంట్లుగా వాడుకుంటుందని మండిపడ్డ కిషన్ రెడ్డి…ప్రజలు అధికారపార్టీకి గుణపాఠం చెప్పే రోజు దగ్గర్లోనే ఉందన్నారు.

మాట్లాడితే బీజేపీని ఓడిస్తామంటున్న టీఆర్ఎస్…బీజేపీని చూస్తే మీకు వణుకు మొదలయ్యింది కాబట్టే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. మోదీని గద్దెదించుతామంటున్న నేతలు ఫాంహౌజ్ రెస్ట్ తీసుకుంటున్నారంటూ ఎద్దేవా చేశారు. వెయ్యిమంది కేసీఆర్ లు , ఓవైసీలు వచ్చినా మోదీ ఏం చేయలేరన్నారు. బీజేపీని బీఆర్ఎస్ అడ్డుకునేంత శక్తి ఉందా…సెటైర్లు వేశారు. 2024లో బీఆర్ఎస్ ఒక సీటు వస్తుందేమో చూద్దామన్నారు. మూడోసారి ప్రధాని మోదీ అధికారం చేపట్టడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

Exit mobile version