Site icon HashtagU Telugu

Kishan Reddy : టీఆర్ఎస్ చేస్తోన్న అసత్య ప్రచారాలను తిప్పికొట్టాలని కార్యకర్తలకు కేంద్రమంత్రి పిలుపు..!!

Kishan Reddy

Kishan Reddy

తెలంగాణలో బీజేపీ అధికారంలో రావడంమే లక్ష్యంగా ప్రతిఒక్కరం పనిచేయాలని పిలుపునిచ్చారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. అధికార టీఆర్ఎస్ పార్టీ బీజేపీ చేస్తోన్న అసత్య ప్రచారాలన్నింటిని తిప్పికొడుతూ…తగిన గుణపాఠం చెప్పాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అదివారం షామీర్ పేటలో ప్రారంభమైన మూడు రోజుల బీజేపీ రాష్ట్రా స్థాయి శిక్షణా శిబిరంలో కిషన్ రెడ్డి మాట్లాడారు. ఈ క్రమంలో టీఆర్ఎస్ పై విరుచుకుపడ్డారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్ ను సమర్థవంతంగా ఎదుర్కొవాలన్నారు. రాష్ట్రంలో బీజేపీని అధికారంలో తీసుకొచ్చేందుకు పార్టీ నేతలంతా పోరాడాలన్నారు. వచ్చే ఏడాదిలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించాలని కిషన్ రెడ్డి పార్టీ క్యాడర్ కు సూచించారు.

టీఆర్ఎస్ రాష్ట్రంలో ఎలాంటి పనులు చేసిందో చెప్పడానికి ఏమీ లేవన్నారు. అందుకే బీజేపీపై తప్పుడు ప్రచారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బీజేపీ ఎదుగుదలను చూసి ఓర్వలేకే టీఆర్ఎస్ ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తోందంటూ ఫైర్ అయ్యారు. మునుగోడులో ప్రజలను బెదిరించి విజయం సాధించారని ఆరోపించారు.