TS : కాంగ్రెస్ నేతలు వ్యాపారులను బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నారు – కిషన్ రెడ్డి

  • Written By:
  • Publish Date - February 6, 2024 / 02:01 PM IST

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy)..కాంగ్రెస్ నేతలపై సంచలన ఆరోపణలు చేసారు. కాంగ్రెస్ నేతలు వ్యాపారులను బెదిరించి డబ్బులు వసూలు చేసి డిల్లీకి సూట్ కేసులు మోస్తున్నారని కిషన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీని ఎవ్వరూ నమ్మడం లేదని, రాహుల్ గాంధీపైన దేశ ప్రజలకు విశ్వాసం లేదని చెప్పుకొచ్చారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం అమీర్ పేటలో బీజేపీ గావ్​ చలో(పల్లెకు పోదాం) అభియాన్ కార్యక్రమంలో కిషన్​ రెడ్డి పాల్గొన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..రాష్ట్రంలోని ప్రభుత్వ యంత్రాంగంలో 95శాతం మోడీ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని ,ఈ ఎన్నికలు మోడీ కోసం కాదు దేశ భవిష్యత్తు కోసమన్నారు. పార్టీ, పార్టీ నాయకుడి కంటే దేశం, దేశ ప్రజలు మాకు ముఖ్యమన్నారు. దేశ వ్యాప్తంగా 24గంటల పాటు గ్రామాల్లో ఉండాలని పార్టీ జాతీయ నాయకత్వం నిర్ణయం తీసుకుందని, జాతీయ అధ్యక్షుడు జేపీ.నడ్డా సహా అందరూ గ్రామాలను సందర్శిస్తున్నారని తెలిపారు. గ్రామంలోని రాజకీయ పరిస్థితులు, పార్లమెంట్ ఎన్నికలకు సన్నద్ధం చేయడం కార్యక్రమం లక్ష్యమన్నారు. తెలంగాణలోని అన్ని గ్రామాల్లో పల్లెకు పోదాం.. అభియాన్ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. పేద ప్రజల అభివృద్ధి, మహిళా సాధికారత, శాంతి భద్రతల కోసం దేశంలోని ప్రభుత్వం పని చేస్తుందన్నారు. జాతీయ రహదారులతో దేశ వ్యాప్తంగా మోడీ ప్రభుత్వం అనుసంధానం చేసిందని తెలిపారు.పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపిని విజయపథంలో నడిపించాలని తెలిపారు.

ఇదే సందర్బంగా కాంగ్రెస్ పార్టీ ఫై , నేతలే కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. గ్యారంటీల పేరుతో రాహుల్ గాంధీ తెలంగాణలో గారడీ చేస్తున్నారని, తెలంగాణ సీఎం రేవంత్ డిల్లీకి, హైదరాబాద్ కు తిరుగుతున్నారని అన్నారు. కాంగ్రెస్ నాయకులు వ్యాపారులను బెదిరించి డబ్బులు వసూలు చేసి డిల్లీకి సూట్ కేసులు మోస్తున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీని ఎవ్వరూ నమ్మడం లేదని, రాహుల్ గాంధీపైన దేశ ప్రజలకు విశ్వాసం లేదన్నారు.

Read Also : Bodhan Ex MLA Shakeel : బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేపై లుక్ ఔట్ నోటీసులు