Site icon HashtagU Telugu

Pawan Kalyan : జనసేన పొత్తుపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు

Bandi Pawan

Bandi Pawan

ఏపీలో జనసేన పార్టీ (Janasena Party)..బిజెపి(BJP) తో పొత్తు పెట్టుకున్న ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇక తెలంగాణ లో ను అలాగే బిజెపి తో కలిసి పనిచేస్తామని తాజాగా కొండగట్టు పర్యటన లో జనసేన అధినేత, ఏపీ ఉప ముఖ్య మంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) స్పష్టం చేసారు. ఈ వ్యాఖ్యలపై జనసేన శ్రేణులు , అటు బిజెపి శ్రేణులు సంతోషం వ్యక్తం చేసారు. అయితే కేంద్రమంత్రి బండి సంజయ్ (Bandi Sanjay)..పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై స్పందించారు.

We’re now on WhatsApp. Click to Join.

తెలంగాణలో బీజేపీతో కలిసి పని చేయడంపై వాళ్ల వైఖరి ఏంటో జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ స్పష్టం చేశారని.. కానీ దీనిపై ఇప్పుడే తాము నిర్ణయం తీసుకోలేమని అన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి, కార్యకర్తలతో చర్చించి తర్వాత జనసేనతో కలిసి పని చేయడంపై నిర్ణయం తీసుకుంటామని బండి స్పష్టం చేశారు.

అంతేకానీ హైకమాండ్‌తో చర్చించకుండా పొత్తులపై ఎవరికీ వారు నిర్ణయం తీసుకోలేమని పేర్కొన్నారు. తెలంగాణలో బీజేపీ, జనసేన కలిసి పని చేయడం, పొత్తు వ్యవహారంపై పార్టీ అధిష్టానం చూసుకుంటుందని వెల్లడించారు. తెలంగాణలో బీజేపీతో కలిసి పని చేయడంపై వాళ్ల వైఖరి ఏంటో జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ స్పష్టం చేశారని.. కానీ దీనిపై ఇప్పుడే తాము నిర్ణయం తీసుకోలేమని అన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి, కార్యకర్తలతో చర్చించి తర్వాత జనసేనతో కలిసి పని చేయడంపై నిర్ణయం తీసుకుంటామని బండి స్పష్టం చేశారు.

గతేడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, జనసేన కలిసి పోటీ చేసిన విషయం తెలిసిందే. పొత్తులో భాగంగా జనసేనకు బీజేపీ 8 సీట్లు కేటాయించగా.. పోటీ చేసిన 8 స్థానాల్లో జనసేన డిపాజిట్లు కోల్పోయింది. ఈ ప్రభావంతో ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ తెలంగాణలో ఒంటరిగానే పోటీ చేసి 8 చోట్ల విజయం సాధించింది. తెలంగాణ లో జనసేన కు పెద్దగా జన అదరణలేదని ఎన్నికల ఫలితాల్లో స్పష్టంగా తేలింది. అందుకే బండి సంజయ్ ఈ విధంగా మాట్లాడి ఉంటరాని అంత మాట్లాడుకుంటున్నారు.

Read Also : Amavasya: పొరపాటున కూడా అమావాస్య రోజు ఇలా అస్సలు చేయకండి.. చేశారు దరిద్రం చుట్టుకోవడం ఖాయం?