Minister Amit shah: బండి సంజ‌య్‌కు అమిత్ షా ఫోన్‌.. ఆ విష‌యంపై స్ప‌ష్ట‌మైన హామీ ఇచ్చిన షా..

కేంద్ర మంత్రి అమిత్‌షా బండి సంజ‌య్‌కు ఫోన్ చేశారు. అధ్యక్షుడి మార్పుపై వస్తోన్న వార్తలను పట్టించుకోవద్దని సంజ‌య్ సూచించారు. ఇదే దూకుడుతో పనిచేయాలని, కేసీఆర్ ను గద్దె దించటమే లక్ష్యంగా దూసుకెళ్లాల‌ని సూచించారు.

  • Written By:
  • Updated On - June 28, 2023 / 09:38 PM IST

తెలంగాణ రాష్ట్రం (Telangana State)లో మ‌రికొద్ది నెల‌ల్లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రిగే అవ‌కాశం ఉంది. అధికార బీఆర్ఎస్ (BRS) పార్టీతోస‌హా బీజేపీ , కాంగ్రెస్ పార్టీలు ఎన్నిక‌ల వ్యూహాల‌ను సిద్ధం చేసుకుంటున్నాయి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికారంలోకి వ‌చ్చేది మేమంటేమేమంటూ ఆ పార్టీ నేత‌లు ధీమాతో ఉన్నారు. గ‌త నెల‌లో వెలువ‌డిన క‌ర్ణాట‌క అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాల ముందు వ‌ర‌కు తెలంగాణ‌లో బీజేపీ హ‌వాసాగింది. బీఆర్ఎస్ ప్ర‌భుత్వానికి ప్ర‌త్యామ్నాయం మేమేనంటూ బీజేపీ నేత‌లు చెప్పుకొచ్చారు. కానీ క‌ర్ణాట‌క ఫ‌లితాల త‌రువాత ఉన్న‌ట్లుండి తెలంగాణ‌లో కాంగ్రెస్ హ‌వా పెరిగింది. బీజేపీలో చేరుతార‌నుకున్న నేత‌లంతా కాంగ్రెస్ గూటికి వెళ్లేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. ఇదే క్ర‌మంలో తెలంగాణ బీజేపీలో వ‌ర్గ‌విబేధాలు తారాస్థాయికి చేరాయి.

తెలంగాణ బీజేపీలో రెండుమూడు వ‌ర్గాలుగా నేత‌లు విడిపోయిన‌ట్లు పార్టీలో చ‌ర్చ జ‌రుగుతుంది. పార్టీలో ఈట‌ల రాజేంద‌ర్‌, కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి చేరిక‌తో కొంద‌రు పాత నేత‌లు అసంతృప్తితో ఉన్న‌ట్లు ప్ర‌చారం జ‌రిగింది. దీనికితోడు ఈట‌ల‌కు రాష్ట్ర అధ్య‌క్ష బాధ్య‌త‌లు అప్ప‌గిస్తార‌న్న ప్ర‌చారం కొద్దిరోజులు న‌డిచింది. అప్ప‌టి నుంచి బండి సంజ‌య్‌ను తెలంగాణ బీజేపీ అధ్య‌క్ష బాధ్య‌త‌ల నుంచి తొల‌గిస్తార‌నే ప్ర‌చారం జోరుగాసాగుతుంది. బండి సంజ‌య్ అధ్య‌క్ష బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌రువాత  బీఆర్ఎస్ ప్ర‌భుత్వంపై దూకుడు రాజ‌కీయాల‌తో బీజేపీ శ్రేణుల్లో నూత‌నోత్సాహాన్ని నింపారు.

సంజ‌య్‌ను బీజేపీ అధ్య‌క్ష బాధ్య‌త‌ల నుంచి తొల‌గిస్తున్నార‌న్న ప్ర‌చారంపై తాజాగా కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డికూడాస్పందించారు. అధ్య‌క్షుడి మార్పు ఉండ‌ద‌ని, ఆ మేర‌కు కేంద్ర పార్టీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకోలేద‌ని స్ప‌ష్టం చేశారు. బండి సంజ‌య్ ను అధ్య‌క్ష ప‌ద‌వి నుంచి త‌ప్పిస్తార‌ని తెలంగాణ వ్యాప్తంగా విస్తృత ప్ర‌చారం జ‌రుగుతున్న నేప‌థ్యంలో బుధ‌వారం సాయంత్రం కేంద్ర మంత్రి అమిత్‌షా బండి సంజ‌య్‌కు ఫోన్ చేశారు. అధ్యక్షుడి మార్పుపై వస్తోన్న వార్తలను పట్టించుకోవద్దని సంజ‌య్ సూచించారు. ఇదే దూకుడుతో పనిచేయాలని, కేసీఆర్ ను గద్దె దించటమే లక్ష్యంగా దూసుకెళ్లాల‌ని, మా పూర్తి సహకారం మీకు ఉంటోంద‌ని అమిత్ షా సంజ‌య్‌కు స్ప‌ష్ట‌మైన హామీ ఇచ్చార‌ట‌. దీంతో కొద్దికాలంగా బీజేపీ అధ్య‌క్షుడిగా బండి సంజ‌య్ ను తొల‌గిస్తార‌న్న ప్ర‌చారానికి ఒక్క ఫోన్‌కాల్‌తో అమిత్ షా చెక్ పెట్టిన‌ట్ల‌యింది.

Karnataka: జూలై 1 నుంచి కర్ణాటకలో డిబిటి ద్వారా 10 కేజీల ఉచిత బియ్యం పంపిణి