Amit Shah Tour Schedule: అమిత్ షా టూర్ షెడ్యూల్ ఇదే!

రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో రాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఇప్పటికే మునుగోడు కేంద్రంగా అన్ని పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి.

  • Written By:
  • Updated On - August 19, 2022 / 07:05 PM IST

రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో రాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఇప్పటికే మునుగోడు కేంద్రంగా అన్ని పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మునుగోడు సీటును గెలుచుకొని తెలంగాణ లో సత్తా చాటాలని భావిస్తోంది బీజేపీ. ఈ నేపథ్యంలో కేంద్రం హోంమంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఆగస్టు 21న మునుగోడులో అమిత్ షా ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. ఆగస్టు 21న మధ్యాహ్నం 3:40 గంటలకు శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంటారు. సాయంత్రం 4.15 గంటలకు నల్గొండ జిల్లా మునుగోడుకు వెళ్లనున్నారు.

సాయంత్రం 4:35 గంటలకు మునుగోడులో సిఆర్‌పిఎఫ్ అధికారులతో అమిత్ షా సమావేశమై సమీక్ష నిర్వహించనున్నారు. 4:40 నుండి 6:00 వరకు ప్రజలకు తెరిచి ఉండే సమావేశంలో ఆయన పాల్గొంటారు. సమావేశం అనంతరం ఆయన వాహనంలో రామోజీ ఫిల్మ్ సిటీకి చేరుకుంటారు. అమిత్ షా 6:45 నుండి 7:30 వరకు ఫిల్మ్ సిటీలో ఉంటారు. రాత్రి 8:00 గంటల నుంచి 9:30 గంటల వరకు శంషాబాద్‌లోని నోవాటెల్‌లో పార్టీ ముఖ్య సభ్యులతో సమావేశం కానున్నారు. మునుగోడు ఉప ఎన్నికలకు సంబంధించి అమిత్ షా పార్టీ సభ్యులకు సూచనలు చేస్తారని సమాచారం. ఆ తర్వాత తిరిగి న్యూఢిల్లీకి వెళ్తారు.