Site icon HashtagU Telugu

Nirmala Sitharaman : తెలంగాణలో పసిబిడ్డపైనా లక్ష అప్పు..లెక్క చెప్పాల్సిందే..!!

Nirmala New

Nirmala New

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విమర్శలు గుప్పించారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల్లోకి నెట్టేశారన్నారు. అప్పుడే పుట్టిన బిడ్డకు కూడా లక్షల రూపాయల అప్పు కట్టాల్సిన దుస్తితి నెలకొందన్నారు. ఉపాధి హామీ పథకం కోసం రూ. 20వేల కోట్లు ఇచ్చామని చెప్పారు. కేంద్రం పంపించిన డబ్బులు ఖర్చు చేయకపోయినట్లయితే అధికారులు విచారణ చేస్తారంటూ హెచ్చరించారు. వీటన్నింటిపై సమాధానం చెప్పాల్సిన బాధ్యత రాష్ట్ర సర్కార్ పై ఉందన్నారు. తానే ప్రధానమంత్రి అన్నట్లుగా దేశ పర్యటన చేస్తున్నారంటూ సెటైర్లు విసిరారు. ఉపాధి హామీ పథకం సర్వే కోసం అధికారులు రాష్ట్రానికి వచ్చారని…లాభాల్లో ఉన్న రాష్ట్రాన్ని అప్పుల్లోకి నెట్టేశారంటూ మండిపడ్డారు. కేంద్ర పథకాలన్నీ కూడా అమల్లోకి రావాలని..ప్రజలను భయపెట్టేందుకే కేసీఆర్ ఇలా మాట్లాడుతున్నారంటూ ఆరోపించారు.

మన ఊరు-మన బడి కేంద్ర పథకం అయితే…దానిని రాష్ట్ర స్కీంగా చెప్పుకుంటూ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు వ్యయాన్ని రూ. 1.20లక్షల కోట్లకు పెంచారన్నారు. తెలంగాణలో ప్రతి వందమందిలో 91 మంది రైతులు అప్పుల పాలయ్యారని…రైతు ఆత్మహత్యల్లో తెలంగాణ దేశంలోనే 4వ స్థానంలో ఉందని ఆమె వ్యాఖ్యనించారు. బడ్జెట్ లో అప్పులన్నింటిని ఎందుకు చూపించడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రం అప్పుల గురించి అడిగే అధికారం కేంద్రానికి ఉందన్న నిర్మలా సీతారామన్.. FRBM పరిమితిని తెలంగాణ దాటిపోయిందని వెల్లడించారు.

Exit mobile version