Site icon HashtagU Telugu

CM Revanth Davos Tour : తెలంగాణలో పెట్టుబడి పెట్టేందుకు యూనిలీవర్ గ్రీన్ సిగ్నల్

Unilever To Setup 2 Manufac

Unilever To Setup 2 Manufac

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన (CM Revanth Davos )లో కీలకమైన ఒప్పందం కుదిరింది. వినియోగ వస్తువుల తయారీలో ప్రపంచ ప్రసిద్ధి పొందిన యూనిలీవర్ సంస్థ (Unilever ) తెలంగాణ (Telangana)లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి వ్యక్తం చేసింది. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు(Minister Sridhar Babu)లతో పాటు తెలంగాణ ప్రతినిధి బృందం యూనిలీవర్ సీఈవో హీన్ షూమేకర్‌తో సమావేశమై, రాష్ట్రంలోని పెట్టుబడుల అవకాశాలను వివరించారు.

TGreen Policy 2025 : తెలంగాణలో ‘హరిత’ వెలుగులు.. ‘టీ‌గ్రీన్ -2025’ పాలసీలో ఏముందో తెలుసా ?

యూనిలీవర్ సంస్థ రాష్ట్రంలో రెండు యూనిట్లు ఏర్పాటు చేయడానికి సుముఖత వ్యక్తం చేసింది. కామారెడ్డి జిల్లాలో పామాయిల్ శుద్ధి యూనిట్‌(Palm oil refining facility)తో పాటు బాటిల్ క్యాప్స్ తయారీ యూనిట్‌(bottle caps manufacturing unit)ను ప్రారంభించేందుకు అంగీకారం తెలిపింది. యూనిలీవర్ సంస్థ తెలంగాణలో పెట్టుబడులు పెట్టడం ద్వారా స్థానిక యువతకు ఉపాధి కల్పించడంతో పాటు సంస్థ వృద్ధికి అవకాశం ఉంటుందని సీఎం రేవంత్ వివరించారు. తెలంగాణలో జరుగుతున్న పరిశ్రమల అభివృద్ధి కార్యక్రమాలు, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల పట్ల యూనిలీవర్ సీఈవో హీన్ షూమేకర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో ఐటీ&ఐసీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, సీఎంఓ ప్రధాన కార్యదర్శి శేషాద్రి తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ రైజింగ్ బృందం వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సందర్భంగా వివిధ కంపెనీల ప్రతినిధులతో సమావేశమైంది. ఐటీ మంత్రి శ్రీధర్ బాబు సాంబనోవా కంపెనీ ప్రతినిధులతో సెమీ కండక్టర్ పరిశ్రమల పెట్టుబడులపై చర్చలు జరిపారు. కాలిఫోర్నియాకు చెందిన సాంబనోవా కంపెనీ, ఎఐ హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ పరిష్కారాల్లో పేరుపొందింది. దావోస్ పర్యటనలో పలు పరిశ్రమలు తెలంగాణలో పెట్టుబడులకు ఆసక్తి చూపించడమే కాకుండా ముఖ్యమైన ఒప్పందాలు కుదుర్చుకోవడం రాష్ట్ర పరిశ్రమల అభివృద్ధికి కీలకమైంది.