Uniform Civil Code Worry : KCR కు పిత‌లాట‌కం

Uniform Civil Code Worry : థ‌ర్డ్ పార్టీ స‌ర్వేతో బీఆర్ఎస్ ఢీలా ప‌డింది.మూడో వంత స్థానాల్లో కూడా విజ‌యం అసాధ్య‌మ‌ని  స‌ర్వే సారాంశ‌మ‌ట‌.

  • Written By:
  • Publish Date - July 10, 2023 / 01:41 PM IST

Uniform Civil Code Worry : థ‌ర్డ్ పార్టీ స‌ర్వేతో బీఆర్ఎస్ ఢీలా ప‌డింద‌ని తెలుస్తోంది. ఆ పార్టీకి మూడో వంత స్థానాల్లో కూడా విజ‌యం అసాధ్య‌మ‌ని  స‌ర్వే సారాంశ‌మ‌ట‌. ఇలాంటి ప‌రిస్థితుల్లో కేసీఆర్ వేసే ఎత్తుగ‌డ ఏమిటి? రాబోవు రోజుల్లో సిట్టింగ్ ల ను కాద‌ని కొత్త వాళ్ల‌కు టిక్కెట్ల ఇవ్వ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నార‌ని తెలుస్తోంది. అదే జ‌రిగితే, బీఆర్ఎస్ పార్టీ నుంచి వ‌ల‌స‌లు భారీగా ఉంటాయ‌ని వినికిడి. అందుకే, బుజ్జ‌గింపుల ప‌ర్వం ప్ర‌గ‌తిభ‌వ‌న్ కేంద్రంగా కొన‌సాగుతోంద‌ని పార్టీ వ‌ర్గాల్లోని చర్చ‌.

థ‌ర్డ్ పార్టీ స‌ర్వేతో బీఆర్ఎస్ ఢీలా.(Uniform Civil Code Worry)

కాంగ్రెస్ పార్టీకితో క‌లిసి బీఆర్ఎస్ రాజ‌కీయాలు న‌డుపుతోంద‌ని బీజేపీ చేస్తోన్న ఆరోప‌ణ‌. అందుకు ఉదాహ‌ర‌ణ‌గా ఇటీవ‌ల పార్ల‌మెంట్ వేదిక‌గా కాంగ్రెస్ తో క‌ల‌సి సంయుక్త పార్ల‌మెంట‌రీ క‌మిటీ ఏర్పాటుకు డిమాండ్ చేసింది. ఆదానీ కంపెనీల‌పై హిడెన్ బ‌ర్గ్ నివేదిక. పార్ల‌మెంట్ వేదిక‌గా దుమారం రేపిన‌ప్పుడు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ వెంట ఉంది. రాష్ట్ర‌ప‌తి, ఉప రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల్లోనూ కాంగ్రెస్ పార్టీతో క‌లిసి అడుగులు వేసింది. ఇదే విష‌యాన్ని బీజేపీ గుర్తు చేస్తూ కాంగ్రెస్ పార్టీతో చీక‌టి రాజ‌కీయాన్ని(Uniform Civil Code Worry)  కేసీఆర్ న‌డుపుతున్నార‌ని ఆరోపిస్తోంది.

తొమ్మిదేళ్లుగా ప్ర‌తి బిల్లుకు పార్ల‌మెంట్ వేదిక‌గా బీఆర్ఎస్ మ‌ద్ధ‌తు

బీజేపీకి బీ టీమ్ గా బీఆర్ఎస్ ఉంద‌ని ఇటీవ‌ల కాంగ్రెస్ పార్టీ బ‌లంగా వినిపిస్తోంది. అందుకు ఉదాహ‌ర‌ణ‌గా ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్ లో క‌విత‌కు క్లీన్ చిట్ ఇవ్వ‌డాన్ని ఎత్తుచూపుతోంది. ఆధారాలు ఉన్నాయ‌ని వీడియోల‌ను విడుద‌ల చేసిన బీజేపీ పెద్ద‌లు సీబీఐ, ఈడీ విచార‌ణ నుంచి క‌విత‌ను త‌ప్పించార‌ని కాంగ్రెస్ భావిస్తోంది. ఢిల్లీలో నెయ్యం, గ‌ల్లీలో కొట్లాట అన్న‌ట్టు బీజేపీ, బీఆర్ఎస్ వ్య‌వ‌హారం ఉంద‌ని స‌ర్వ‌త్రా వినిపిస్తోంది. అంతేకాదు, తొమ్మిదేళ్లుగా ప్ర‌తి బిల్లుకు పార్ల‌మెంట్ వేదిక‌గా బీఆర్ఎస్ మ‌ద్ధ‌తు ప‌లికింది. వ్య‌వ‌సాయ చ‌ట్టాల బిల్లుపై(Uniform Civil Code Worry)  ఓటింగ్ జ‌రిగిన‌ప్పుడు కూడా ప‌రోక్షంగా బీజేపీకి మ‌ద్ధ‌తు ప‌లుకుతూ బ‌హిష్క‌ర‌ణ చేసింది.

Also Read : Uniform Civil Code: UCC అంటే ఆర్టికల్ 370ని రద్దు చేసినంత సులువు కాదు

రాబోవు పార్ల‌మెంట్ వ‌ర్షాల స‌మావేశాల్లోనూ బీఆర్ఎస్ పార్టీ వ్య‌వ‌హారం ఎలా ఉంటుంది? అనే దానిపై విస్తృతంగా చ‌ర్చ సాగుతోంది. యునిఫాం సివిల్ కోడ్ బిల్లుపై ఆ పార్టీ ఏ నిర్ణ‌యం తీసుకున్న‌ప్ప‌టికీ రాజ‌కీయంగా కార్న‌ర్ అయ్యే అవ‌కాశం ఉంది. ఒక వేళ బిల్లుకు మ‌ద్ధ‌తు ఇస్తే, బీజేపీతో క‌లిసి బీఆర్ఎస్ ఉంద‌ని కాంగ్రెస్ చెబుతోంది. ఆ బిల్లును వ్య‌తిరేకిస్తే కాంగ్రెస్ పార్టీతో క‌లిసి బీఆర్ఎస్ ఉంద‌ని బీజేపీ స్లోగ‌న్ అందుకుంటుంది. మ‌ధ్యామార్గంగా ఆ బిల్లు (Uniform Civil Code Worry)పార్ల‌మెంట్ ఉభ‌య స‌భ‌ల నుంచి బ‌హిష్క‌రించిన‌ప్ప‌టికీ ప‌రోక్షంగా బీజేపీకి మ‌ద్ధ‌తు ప‌లికిన‌ట్టే అవుతుంది.

Also Read : Uniform Civil Code : జ‌గ‌న్ కు మోడీ అగ్నిప‌రీక్ష‌, ఉమ్మ‌డి పౌర‌స్మృతి బిల్లుతో లొల్లి

ఈనెల 20వ తేదీన ప్రారంభ‌మ‌య్యే పార్ల‌మెంట్ స‌మావేశాల సంద‌ర్భంగా బీఆర్ఎస్ రాజ‌కీయ ఏమిటి? అనేది బ‌య‌ట‌ప‌డ‌నుంది. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ వ‌రంగ‌ల్ వ‌చ్చిన సంద‌ర్భంగా కేసీఆర్ స‌ర్కార్ పై చేసిన ఆరోప‌ణ‌ల‌ను బ‌లంగా బీఆర్ఎస్ నేత‌లు తిప్పికొట్టారు. అయిన‌ప్ప‌టికీ, ప్ర‌జ‌లు మాత్రం ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్ నుంచి క‌విత‌ను త‌ప్పించార‌న్న భావ‌న‌లో ఉన్నారని స‌ర్వ‌త్రా వినిపిస్తోంది. అందుకే, యూనిఫాం సివిల్ కోడ్ బిల్లు విష‌యంలో బీఆర్ఎస్ వ్య‌వ‌హ‌రించే తీరు ఆధారంగా భవిష్య‌త్ రాజ‌కీయాన్ని అంచ‌నా వేయొచ్చు. ఇప్ప‌టికే తాజా స‌ర్వేల్లో వెనుక‌బ‌డిన బీఆర్ఎస్ ను ఏ విధంగా కేసీఆర్ గ‌ట్టెక్కిస్తారు? అనేది చ‌ర్చ‌నీయాంశం అయింది.