Uniform Civil Code: యూనిఫాం సివిల్ కోడ్‌పై తమిళిసై కీలక వ్యాఖ్యలు

దేశవ్యాప్తంగా యూనిఫాం సివిల్ కోడ్‌పై చర్చ జరుగుతుంది. ఈ విధానాన్ని అమలు పరుస్తామని బీజేపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోగా,

Uniform Civil Code: దేశవ్యాప్తంగా యూనిఫాం సివిల్ కోడ్‌పై చర్చ జరుగుతుంది. ఈ విధానాన్ని అమలు పరుస్తామని బీజేపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోగా, విపక్షాలు మాత్రం నసేమిరా అంటున్నాయి. యూనిఫాం సివిల్ కోడ్‌ అనేది సాధ్యపడదని, కొన్ని వర్గాలకు ఆ విధానం నచ్చడం లేదన్నది సుస్పష్టం. ఈ సమయంలో తెలంగాణ గవర్నర్ తమిళిసై యూనిఫాం సివిల్ కోడ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

యూనిఫాం సివిల్ కోడ్‌ అమలు చేస్తే దేశంలోని మహిళలకు సాధికారత చేకూరుతుందని అన్నారు తెలంగాణ గవర్నర్ తమిళిసై. తెలంగాణలో నిన్న ఆమె ఓ మీడియా ఛానెల్ తో మాట్లాడుతూ.. “నేను యూనిఫాం సివిల్ కోడ్ కి మద్దతు ఇస్తున్నాను. ఇది మహిళలకు అవసరమని ఆమె తెలిపారు. యూనిఫాం సివిల్ కోడ్‌ మహిళలకు సాధికారత కల్పిస్తోంది. అయిదు ఆరుగురు అన్నదమ్ములు ఉంటే ప్రతి ఒక్కరికీ ప్రత్యేక చట్టం ఉండదని ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికే సభలో చెప్పారని ఆమె గుర్తు చేశారు.

Also Read: Passenger Drives Plane : పైలట్ ను పక్కకు జరిపి ఆ ప్యాసింజర్ విమానం నడిపింది.. ఎందుకు ?