Site icon HashtagU Telugu

Chalo Medigadda : బీఆర్ఎస్ ‘చలో మేడిగడ్డ’‌లో ఊహించని ఘటన.. పేలిన బస్సు టైర్

Chalo Medigadda

Chalo Medigadda

Chalo Medigadda : ‘చలో మేడిగడ్డ’ కు వెళ్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. వారు ప్రయాణిస్తున్న బస్సు టైర్ ఒక్కసారిగా  పేలిపోయింది. దీంతో మార్గంమధ్యలోనే ఆ బస్సు ఆగింది. జనగాం వద్ద చోటుచేసుకున్న ఈ ఘటనతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొంతమేర ఆందోళనకు గురయ్యారు.  ‘చలో మేడిగడ్డ’ కు వెళ్తున్న ఈ బస్సులో కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో పాటు మీడియా ప్రతినిధులు ఉన్నారు. సమాచారం అందుకున్న మిగిలిన ఎమ్మెల్యేలు, ఇతర నేతలు సహాయక చర్యలు చేపడుతున్నారు. స్థానికంగా ఉన్న మెకానిక్‌ను పిలిపించిన నేతలు దగ్గరుండి టైర్ మార్పిస్తున్నారు. ఈ ప్రమాదం తర్వాత మరో బస్సులో ఎమ్మెల్యేలు మేడిగడ్డకు బయల్దేరి వెళ్లారు. ఏది ఏమైనప్పటికీ  బీఆర్ఎస్ తలపెట్టిన ‘చలో మేడిగడ్డ’ టూర్‌లో బస్సు టైర్ బ్లాస్ట్ కావడం కలకలం రేపింది.

We’re now on WhatsApp. Click to Join

కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్ పార్టీల మధ్య పెద్ద యుద్ధమే జరుగుతోంది. ఓవైపు ఈ వివాదం కొనసాగు తుండగానే.. బీఆర్ఎస్ పార్టీ ఇవాళ ‘చలో మేడిగడ్డ’ (Chalo Medigadda) కార్యక్రమాన్ని చేపట్టింది. హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ నుంచి బీఆర్ఎస్ నేతలు మేడిగడ్డకు బయలుదేరారు. ఈసందర్భంగా మేడిగడ్డ యాత్ర ఎందుకో కవితాత్మకంగా తెలుపుతూ కేటీఆర్ ఓ ట్వీట్ చేశారు.

Also Read : Salman Khan : వామ్మో..రూ.23 కోట్లు పెట్టి వజ్రాల వాచ్ కొనుగోలు చేసిన హీరో

కేటీఆర్ ట్వీట్  ఇదీ.. 

“మళ్లీ తెలంగాణను ఎడారిగా మార్చే కాంగ్రెస్ కుట్రలు ఎండగట్టడానికే.. ఈ “చలో మేడిగడ్డ”

చిన్న లోపాన్ని..
పెద్ద భూతద్దంలో చూపిస్తూ..
బాధ్యత మరిచిన కాంగ్రెస్ నిజస్వరూపాన్ని
బట్టబయలు చేసేందుకే.. ఈ “చలో మేడిగడ్డ”

ప్రజాధనంతో కట్టిన ప్రాజెక్టును పరిరక్షించకుండా..
కూలిపోవాలని చూస్తున్న కాంగ్రెస్ కుతంత్రాన్ని ప్రజల సాక్షిగా నిలదీయడానికే..
ఈ “చలో మేడిగడ్డ”

పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో
పండుగలా మారిన వ్యవసాయాన్ని
మళ్లీ దండగలా మార్చే కాంగ్రెస్ పన్నాగాలకు పాతరేసేందుకు
ఈ “ చలో మేడిగడ్డ ”

పంజాబ్ నే తలదన్నే స్థాయికి ఎదిగిన
తెలంగాణ రైతుకు వెన్నుపోటు పొడుస్తున్న
కాంగ్రెస్ నీచ సంస్కృతికి సమాధి కట్టేందుకే ఈ “చలో మేడిగడ్డ”

మరమ్మత్తులు కూడా చేతకాని “గుంపుమేస్త్రీ”ని
నమ్ముకుంటే తెలంగాణ రైతు నిండా మునుగుడే..
అని మరోసారి చాటిచెప్పేందుకే ఈ “చలో మేడిగడ్డ”

దశాబ్దాలపాటు..
కాంగ్రెస్ చేసిన తప్పులను..
కాంగ్రెస్ పాలనలో సాగునీటి తిప్పలను..
అరవై ఏళ్లు కాంగ్రెస్ పెట్టిన అరిగోసను
అన్నదాతలు మరువలేదని గుర్తుచేసేందుకే.. ఈ “చలో మేడిగడ్డ”

మళ్లీ కన్నీటి సాగుకు
తెలంగాణను కేరాఫ్ గా మారిస్తే సహించం..

మీ దుష్ట రాజకీయాల కోసం..
మా తెలంగాణ రైతాంగాన్ని బలిచేస్తే భరించం..

పోటీ యాత్రలు చేయడం కాదు..
ప్రజలు అప్పగించిన డ్యూటీ చేయండి..

మేడిగడ్డకు మరణశాసనం రాయాలని చూస్తే..
తెలంగాణ గడ్డపై.. కాంగ్రెస్ కే నూకలు చెల్లడం ఖాయం
వచ్చే వరదల్లో.. కాంగ్రెస్ పార్టీయే కొట్టుకుపోవడం తథ్యం
జై తెలంగాణ
జై కాళేశ్వరం
జై బీఆర్ఎస్” అని కేటీఆర్ ట్వీట్ చేశారు.

Also Read : Janasena : బాబాయ్ కోసం ప్రచారం చేస్తునంటున్న మెగా డాటర్

Exit mobile version