Site icon HashtagU Telugu

UNESCO Awards: దోమకొండ కోటకు యునెస్కో అవార్డు…!!

Domakonda

Domakonda

కామారెడ్డి జిల్లా దోమకొండ కోట…యునెస్కో పురస్కారానికి ఎంపికైంది. ప్రజలు, పౌరసంస్థలు, వ్యక్తుల ఆధ్వర్యంలో సాంస్కృతిక వారసత్వ కట్టడాల పునరుద్ధరణలో ప్రతిభ కనపరిచిన పనులకు యునెస్కో అవార్డులను ప్రకటించింది. ఆసియా విభాగానికి మూడు నిర్మాణాలు ఎంపిక అయ్యాయి. అందులో రెండు తెలంగాణకు చెందినవి ఉన్నాయి. అందులో గోల్కొండ మెట్లబావి, దోమకొండ కోట అవార్డ్ ఆఫ్ మెరిట్ కు ఎంపిక అయ్యాయి.

గోల్కొండ మెట్లబావి ఆగాఖాన్ ట్రస్ట్ తన సొంత నిధులతో పనులను చేపట్టింది. ఈ భావి ఇప్పుడు రూపుదిద్దుకుంది. పూర్వపు వైభవాన్ని సంతరించుకుంది. పునరుద్దరణపనులు అద్భుతంగా ఉన్నాయంటూ యునెస్కో మెట్లబావిని గుర్తించింది. ఇక దోమకొండ కోటను అప్పటి సంస్థానాదీశుల వారసులు పునరుద్దరణ చేపట్టారు. కోటలో రాతితో మహాదేవుని ఆలయాన్ని చాలా అద్బుతంగా నిర్మించారు. ఈ కోట40 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. చుట్టూ ఎత్తైన రాతీ కట్టడాలుఉన్నాయి. ఈ కోట ప్రముఖ హీరో రాంచరణ్, ఉపాసనల వివాహం ఇక్కడే జరిగింది.