Haath Se Haath Jodo Yatra: మర్రి ఆదిత్య రెడ్డి ఆధ్వర్యంలో ‘హాత్​ సే హాత్ జోడో’ యాత్ర ప్రారంభం

కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ తలపెట్టిన భారత్​ జోడో యాత్ర సందేశాన్ని ప్రతి ఇంటికి తీసుకెళ్లేందుకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​కు రెండు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన మర్రి చెన్నారెడ్డి మనుమడు మర్రి ఆదిత్య రెడ్డి ఆధ్వర్యంలో ‘హాత్​ సే హాత్​ జోడో’ యాత్ర (Haath Se Haath Jodo Yatra) ప్రారంభమైంది.

  • Written By:
  • Updated On - March 19, 2023 / 03:17 PM IST

కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ తలపెట్టిన భారత్​ జోడో యాత్ర సందేశాన్ని ప్రతి ఇంటికి తీసుకెళ్లేందుకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​కు రెండు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన మర్రి చెన్నారెడ్డి మనుమడు మర్రి ఆదిత్య రెడ్డి ఆధ్వర్యంలో ‘హాత్​ సే హాత్​ జోడో’ యాత్ర (Haath Se Haath Jodo Yatra) ప్రారంభమైంది. గురువారం సాయంత్రం ఆయన బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి ఆశీర్వాదం తీసుకొని పాదయాత్రను ప్రారంభించారు. కాంగ్రెస్​ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్​ గాంధీ, మల్లికార్జున్​ ఖర్గే, కాంగ్రెస్​ నేతలు, కార్యకర్తలు ఆరోగ్యంగా ఉండాలని, రాష్ట్ర ప్రజలకు మంచి జరగాలని, యాత్ర విజయవంతం కావాలని కోరుకున్నారు.

Also Read: Andhra Pradesh : ఏపీలోని అన్ని పాఠ‌శాలల్లో త్వ‌ర‌లో డా. బిఆర్ అంబేద్క‌ర్ జీవితంపై పాఠ్యాంశం

ఆ తర్వాత మర్రి చెన్నారెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించి దీవెనలు పొందారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్​ కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషులు పాల్గొన్నారు. మొదటి రోజు యాత్రలో భాగంగా మర్రి ఆదిత్య రెడ్డి సనత్​నగర్​లోని పలు కాలనీల్లో సందర్శించి స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మార్పు కోసం మర్రి చెన్నారెడ్డి అడుగుజాడల్లో ముందుకు వెళ్తానని ప్రజలకు సందేశం అందించారు.