Nirmal Bus Accident: నిర్మల్ జిల్లా మోరపల్లిలో టీజీఎస్‌ఆర్‌టీసీ బస్సు టైర్లు పేలిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. నిర్మల్ బస్ డిపో నుంచి జగిత్యాల వైపు వెళ్తున్న బస్సులో 170 మంది ప్రయాణిస్తున్నట్లు సమాచారం. అదృష్టవశాత్తూ ఈ సంఘటన కారణంగా ఎవరూ గాయపడలేదు. అయితే ఒక్కసారిగా భారీ శబ్దంతో బస్సు రోడ్డుపై కుంగిపోవడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అయితే బస్సు డ్రైవర్ చాకచక్యంగా బస్సును నిలపడంతో భారీ ప్రమాదం తప్పింది. ఈ ఘటతో ఆర్టీసీ యాజమాన్యంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సోషల్ మీడియా సాక్షిగా ప్రజలు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. కాగా ఈ ఘటన తర్వాత ప్రయాణికులు, ప్రధానంగా మహిళలు రోడ్డుపై ఉన్న దృశ్యాలు సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి.
నిర్మల్ బస్సు ఘటనపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తెలంగాణ ప్రభుత్వంపై మండిపడ్డారు. అమాయక పౌరుల జీవితాలతో ఎందుకు ఆడుకుంటున్నారు అని ఆయన ప్రశ్నించారు. టిజిఎస్‌ఆర్‌టిసి బస్ ఫ్లీట్‌ను విస్తరించే ప్రణాళికల గురించి రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు ఎమ్మెల్యే కేటీఆర్. 50 మంది ప్రయాణించాల్సిన బస్సులో 170 మంది ఎక్కారని ఆరోపించారు.
నిన్న మోరపెల్లి వద్ద నిర్మల్ డిపో బస్సులో 170 మంది ప్రయాణిస్తున్న బస్సు వెనుక రెండు టైర్లు ఊడిపోయాయి.ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడకపోవడం నిజంగా అదృష్టమే. ఈ సందర్భంగా కేటీఆర్ ప్రశ్నిస్తూ.. బస్సుల సంఖ్యను ఎప్పుడు పెంచాలని ఆలోచిస్తున్నారు ప్రయాణీకుల సంఖ్యను పరిమితం చేసే విషయంలో ఏదైనా భద్రతా ప్రోటోకాల్ అనుసరించబడుతుందా? అని ఆయన అడిగారు. అధిక సమయం పని చేసే డ్రైవర్లు మరియు కండక్టర్లకు మీరు ఎలా పరిహారం చెల్లిస్తున్నారు అని అడిగాడు.
Also Read: Kolkata Doctor Rape: కోల్‌కతా ఘటనపై నిర్భయ తల్లి ఆగ్రహం, సీఎం రాజీనామా !