Dating App: షాకింగ్ ఘటన.. డేటింగ్ యాప్ ద్వారా క‌లుసుకున్న ఇద్ద‌రు యువ‌కులు!

బాధితుడైన వైద్యుడు మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడి ఆచూకీ కోసం సాంకేతిక ఆధారాలను పరిశీలిస్తున్నారు.

Published By: HashtagU Telugu Desk
Dating App

Dating App

Dating App: హైదరాబాద్‌లో డేటింగ్ యాప్‌ల (Dating App) ద్వారా జరిగే నేరాలకు సంబంధించిన మరో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. డేటింగ్ యాప్ ద్వారా పరిచయమైన ఒక యువకుడు.. మ‌రో పురుష‌ డాక్టర్‌పై లైంగికంగా దాడి చేయబోయి బెదిరించిన ఘటన మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. వైద్యుడు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ఘటన వివరాలు

నగరానికి చెందిన ఒక యువ వైద్యుడు, కొన్ని రోజుల క్రితం డేటింగ్ యాప్‌లో ఒక యువకుడితో పరిచయం పెంచుకున్నాడు. వారిద్దరూ చాటింగ్‌తో బంధం కొనసాగించారు. ఇటీవల కలుసుకోవాలని నిర్ణయించుకొని, మాదాపూర్ పరిధిలోని ఒక ఓయో రూమ్‌ను బుక్ చేసుకున్నారు. రూమ్‌కు వెళ్ళాక ఆ యువకుడు వైద్యుడిపై లైంగిక దాడికి ప్రయత్నించాడు. వైద్యుడు నిరాకరించడంతో ఆ యువకుడు అతనిపై దాడికి దిగాడు.

Also Read: Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్ క్రికెట్ నుండి ఎందుకు విరామం తీసుకున్నాడు?

డబ్బు డిమాండ్, బెదిరింపులు

దాడి చేసిన తర్వాత ఆ యువకుడు వైద్యుడిని బెదిరించడం మొదలుపెట్టాడు. వారిద్దరూ రహస్యంగా కలుసుకున్న విషయాన్ని బయటపెడతానని, అతని పరువు తీస్తానని బెదిరించి డబ్బు డిమాండ్ చేశాడు. భయపడిన వైద్యుడు అతనికి కొంత డబ్బు ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అయితే సదరు యువకుడు అంతటితో ఆగకుండా వైద్యుడు పనిచేస్తున్న ఆసుపత్రి వరకు వెళ్లి మళ్లీ గొడవ చేయడం మొదలుపెట్టాడు. పదేపదే డబ్బు డిమాండ్ చేస్తూ వేధించడంతో వైద్యుడు పోలీసులను ఆశ్రయించాడు.

పోలీసుల దర్యాప్తు

బాధితుడైన వైద్యుడు మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడి ఆచూకీ కోసం సాంకేతిక ఆధారాలను పరిశీలిస్తున్నారు. డేటింగ్ యాప్‌లో వారి చాటింగ్‌ను, ఓయో రూమ్ బుకింగ్ వివరాలను సేకరించి దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ ఘటనతో డేటింగ్ యాప్‌ల పట్ల జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. కేవలం యాప్‌ల ద్వారా పరిచయమైన వ్యక్తులను గుడ్డిగా నమ్మడం వల్ల ఇలాంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని సూచిస్తున్నారు. అపరిచిత వ్యక్తులతో కలుసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని, ఇలాంటి ఘటనలు జరిగితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు.

  Last Updated: 25 Sep 2025, 03:30 PM IST