Site icon HashtagU Telugu

Vande Sadharan : తెలుగు రాష్ట్రాలకు 2 ‘పేదల వందేభారత్’లు.. విశేషాలివీ..

Vande Sadharan

Vande Sadharan

Vande Sadharan : ‘వందే సాధారణ్’ పుష్-పుల్ రైలు ఎట్టకేలకు ట్రాక్‌పైకి ఎక్కింది. తొలిసారిగా వందే సాధారణ్ రైలు ముంబై రైల్వే స్టేషన్‌లోకి ఎంటర్ అయింది. ఈవారం నుంచి వందే సాధారణ్ ట్రైన్‌తో  ట్రయల్ రన్ నిర్వహించనున్నారు. ముంబై-నాసిక్ కారిడార్‌లో ఈ రైలుతో ట్రయల్స్ నిర్వహించనున్నారు.  దీన్ని తొలుత ముంబై – ఢిల్లీ రూట్‌లో నడిపే అవకాశం ఉంది. చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో ‘వందే సాధారణ్’ రైళ్లను తయారు చేస్తున్నారు. ఈ రైలు ఫొటోలను బట్టి.. దీనికి ఇరువైపులా చెరో WAP5 లోకో ఏరోడైనమిక్ ఇంజన్లు ఉన్నాయి. ఈ రైలు ఛార్జీలు తక్కువే ఉంటాయట. గంటకు 130 కి.మీ వేగంతో ఇది నడుస్తుంది. ఈ నాన్ ఏసీ 3టైర్ స్లీపర్ రైలులో 22 కోచ్‌లు ఉంటాయని, ఒకేసారి 1800 మంది ప్రయాణికులను తీసుకెళ్లే సామర్థ్యం ఉంటుందని అంటున్నారు. ‘వందే సాధారణ్’ రైళ్లల్లో 12 స్లీపర్ కోచ్ లు..8 జనరల్ కంపార్టుమెంట్లు ఉంటాయి. ప్రతీ కోచ్ లో సీసీటీవీ కెమెరాలు, ప్రతీ సీటు వద్ద ఫోన్ ఛార్జింగ్ పాయింట్లు, మడతపెట్టగలిగే స్నాక్ టేబుల్స్, లగేజీ ర్యాక్, అగ్ని నియంత్రణ వ్యవస్థ ఉంటాయి. రైలులోని సెమీ పర్మనెంట్ కప్లర్స్ వ్యవస్థ వల్ల కుదుపులు తక్కువగా ఉంటాయి. ఈ రైళ్లు 8.36 నిమిషాల్లోనే 110 కిలో మీటర్ల వేగాన్ని(Vande Sadharan) అందుకోగలదు.

We’re now on WhatsApp. Click to Join.

పేదల వందేభారత్ గా నిలుస్తున్న రెండు వందే సాధారణ్ రైళ్లను తెలుగు రాష్ట్రాలకు రైల్వే శాఖ కేటాయించింది. హైదరాబాద్ – న్యూ ఢిల్లీ మధ్య వందే సాధారణ్ కు లైన్ క్లియర్ అయింది. మరో 13 మార్గాల్లోనూ వీటిని నడిపేందుకు సంబంధించిన ప్రతిపాదనలకు సర్కారు ఆమోదం లభించాల్సి ఉంది. అందులో హైదరాబాద్ – నాగర్ కోయల్ సర్వీసు ఉంది. దీనికి అప్రూవల్  లభిస్తే హైదరాబాద్ నుంచి రెండు వందేసాధారణ్ రైళ్లు ప్రారంభం అవుతాయి. ఈ ఏడాది దీపావళి సమయంలో వందే సాధారణ్ రైళ్ల సర్వీసులకు శ్రీకారం చుట్టాలని భావిస్తున్నట్లు సమాచారం.

Also Read: SKN : మరో యూట్యూబర్ బేబీ ని హీరోయిన్ గా పెట్టి ..బేబీ నిర్మాత సినిమా