అక్రమ సంబంధాలు హత్యలకు సైతం దారితీస్తున్నాయి. రోజురోజుకూ ఈ రకమైన కేసులు పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు. తాజాగా ఓ ఘటనలో పాతబస్తీలో ఇద్దరు ట్రాన్స్ జెండర్లు దారుణ హత్యకు (Murder) గురికావడంతో సంచలనం రేపుతోంది. హైదరాబాద్‌లో మంగళవారం రాత్రి జరిగిన రెండు జంట హత్యల కేసుల్లో ఇద్దరు ట్రాన్స్‌జెండర్లు సహా నలుగురు వ్యక్తులు మరణించారు. ఈ రెండు కేసుల్లోనూ దుండగులు రాళ్లతో దాడి చేసి హత్య చేశారని పోలీసులు తెలిపారు.
25 నుంచి 30 ఏళ్ల మధ్య వయసున్న ఇద్దరు ట్రాన్స్‌జెండర్లు (Transgenders) తెల్లవారుజామున 1 గంటలకు హత్యకు గురయ్యారు. హంతకులు బాధితులను రాళ్లతో కొట్టారు. కత్తిపోట్లను కూడా పోలీసులు గుర్తించారు. మృతులను యూసుఫ్ అలియాస్ డాలీ, రియాజ్ అలియాస్ సోఫియాగా గుర్తించారు. దారుణ హత్యలకు అక్రమ సంబంధమే కారణమని హైదరాబాద్ నైరుతి జోన్ డిప్యూటీ కమిషనర్ కిరణ్ ఖరే తెలిపారు.
దీని ప్రకారం అనుమానితులను గుర్తించి విచారణ చేస్తున్నామని తెలిపారు. మరో ఘటనలో మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని కట్టెదాన్ ప్రాంతంలో ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న ఇద్దరు వ్యక్తులను గుర్తుతెలియని వ్యక్తులు కొట్టి చంపారు. పోలీసులు (Police Case) రెండు కేసుల్లోని మృతదేహాలను (Dead bodies) శవపరీక్ష నిమిత్తం తరలించి విచారణ చేపట్టారు.
Also Read: BC 1 Lakh Scheme: రెండో విడుతలో మళ్లీ లక్ష సాయం అందిస్తాం: మంత్రి గంగుల