Site icon HashtagU Telugu

MLC : ఎన్నికలు లేకుండానే ఎమ్మెల్సీలుగా మహేష్‌ , బల్మూరి వెంకట్‌ ఏకగ్రీవం

Two Mlc Nominees From Congr

Two Mlc Nominees From Congr

తెలంగాణ ఎమ్మెల్యే కోటాలో ఖాళీ అయిన రెండు స్థానాలకు ఎమ్మెల్సీలు(MLC)గా ఎన్ఎస్‌యూఐ స్టేట్ ప్రెసిడెంట్ బల్మూరి వెంకట్ (Balmoor Venkat), టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బీఆర్ఎస్ పార్టీ ఎన్నికలకు దూరంగా ఉండటంతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఇద్దరు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎమ్మెల్సీ పదవులకు ఇతర పార్టీల నుండి ఎవరూ నామినేషన్లు దాఖలు చేయకపోవడంతో బల్మూరి వెంకట్, మహేష్ కుమార్ గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నిక అయినట్లు అసెంబ్లీ సెక్రటరీ ప్రకటించారు.

బీఆర్ఎస్ నేతలు కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. దీంతో వీరిద్దరూ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు ఈ రెండు స్థానాలను భర్తీ చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ క్రమంలో ఎమ్మెల్సీగా ఎన్నికైన బల్మూరి వెంకట్ ధృవీకరణ పత్రం తీసుకునేందుకు అసెంబ్లీకి అభిమానులు, కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీగా బయలుదేరారు. ఎమ్మెల్సీలుగా ఎన్నికైన మహేష్ గౌడ్, వెంకట్‌లకు పలువురు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Read Also : Pawan Kalyan: అంగన్ వాడీల పట్ల సానుకూల దృక్పథంతో ఆలోచించాలి: పవన్ కళ్యాణ్