Site icon HashtagU Telugu

TSRTC Gift: తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో జన్మించిన శిశువులకు సూపర్ గిఫ్ట్

Tsrt C Imresizer

TSRTC Bus

తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో జన్మించిన ఇద్దరు అమ్మాయిలకు జీవితాంతం ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నట్లు టీఎస్ ఆర్టీసీ తెలిపింది. తమ సంస్థకు చెందిన బస్సుల్లో ఇటీవల జన్మించిన ఇద్దరు అమ్మాయిలకు తమ పుట్టిన రోజు గిఫ్ట్ గా సంస్థ నుండి ఉచిత జీవితకాల పాస్‌లను ఇచ్చి వారికి తోడ్పాటును అందించడం గర్వకారణంగా ఉందని సంస్థ ఎండీ సజ్జనార్ తెలిపారు.

నాగర్‌కర్నూల్‌ డిపోకు చెందిన బస్సులో పెద్దకొత్తపల్లి గ్రామ సమీపంలో నవంబర్‌ 30వ తేదీన ఆర్టీసీ బస్సులో మొదటి ఆడపిల్ల జన్మించింది. తాజాగా డిసెంబరు 7వ తేదీ మధ్యాహ్నం సిద్దిపేట సమీపంలో ఆసిఫాబాద్ డిపోకు చెందిన బస్సులో మరో మహిళ కుమార్తెకు జన్మనిచ్చింది.

 https://twitter.com/tsrtcmdoffice/status/1468526397605826561

ఈ ఇద్దరు మహిళలు ఊహించని విధంగా వారి గమ్యస్థానాలకు చేరుకునేలోపే ప్రసవించడం జరిగింది. టీఎస్ ఆర్టీసీ సిబ్బంది మరియు తోటి ప్రయాణీకుల సహాయంతో ఇద్దరు మహిళలు పండంటి ఆడబిడ్డలకు జన్మనిచ్చారు. ఆ రెండు సందర్భాల్లో ఆర్టీసీ సిబ్బంది ఆరోగ్య శాఖ అధికారులతో సమన్వయం చేసుకుని తల్లులు, నవజాత శిశువులను తదుపరి చికిత్స కోసం 108 అంబులెన్స్‌లో సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించారు. ఆ ఇద్దరు శిశువులతో పాటు వారి తల్లులు ఆరోగ్యంగా ఉన్నారు.

ఈ విషయంలో ఆర్టీసీ సిబ్బందితో పాటు తోటి ప్రయాణికులను సంస్థ ఎండీ సజ్జనార్ అభినందించారు.