Site icon HashtagU Telugu

Hyderabad : హైద‌రాబాద్‌లో జోరుగా నిషేధిత ఈ సిగిరేట్లు విక్ర‌యం.. ఇద్ద‌ర్ని అరెస్ట్ చేసిన పోలీసులు

Crime

Crime

హైదరాబాద్ న‌గ‌రంలో జోరుగా నిషేధిత ఈ సిగిరేట్ల విక్ర‌యం జ‌రుగుతుంది. నాంప‌ల్లిలోని షెజాన్‌ హోటల్‌ సమీపంలో నిషేధిత ఎలక్ట్రానిక్‌ సిగరెట్లు విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను శనివారం అరెస్టు చేశారు. కమీషనర్ టాస్క్ ఫోర్స్, సెంట్రల్ జోన్ బృందం, బేగంబజార్ పోలీసులతో కలిసి ద్వయం మహ్మద్ అబ్దుల్ రజాక్ , మహ్మద్ అబ్దుల్ ఖాదర్ లను పోలీసులు ప‌ట్టుకున్నారు. ఇద్దరు నిందితులు సికింద్రాబాద్‌లోని పెన్షన్‌ లేన్‌లోని న్యూబోవెన్‌పల్లికి చెందిన వారని పోలీసులు తెలిపారు. కొన్ని రోజుల నుంచి నిందితులు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లైన ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ-సిగరెట్లను విక్రయిస్తున్నట్లు ప్రకటనలు పోస్ట్ చేస్తూ “వేప్స్ హైదరాబాద్” పేరుతో పేజీని సృష్టించి, ఎక్కువగా కళాశాల విద్యార్థులు, యుక్తవయస్కులైన వినియోగదారులను ఆకర్షించారు. నిందితులు ముంబై నుంచి కొరియర్ ద్వారా రూ. 1200 చొప్పున ఇ-సిగరెట్లను కొనుగోలు చేసి రూ. 2500కి విక్రయించారు. వారు తమ ద్విచక్ర వాహనంపై ఉత్పత్తులను డెలివరీ చేశారని పోలీసులు తెలిపారు. నిందితుల వద్ద నుంచి నిషేధిత ఈ-సిగరెట్లు, రెండు మొబైల్ ఫోన్లు, ద్విచక్ర వాహనం యాక్టివా వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.