Site icon HashtagU Telugu

Telangana: తెలంగాణకు ఆ రెండు రోజులు ఎల్లో అలర్ట్

Heavy Rains

Telangana: భారత వాతావరణ విభాగం (IMD), హైదరాబాద్ డిసెంబర్ 4, 5 తేదీల్లో తెలంగాణకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ రోజుల్లో కొన్ని జిల్లాల్లో కొన్ని ప్రాంతాలలో ఉరుములు మరియు మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని IMD అంచనా వేసింది. హైదరాబాద్‌లో వచ్చే 48 గంటలపాటు తెల్లవారుజామున పాక్షికంగా మేఘావృతమైన ఆకాశం, పొగమంచు/మబ్బుగా ఉండే పరిస్థితులు ఉండే అవకాశం ఉంది.

నగరంలో గరిష్ట ఉష్ణోగ్రతలు 32 డిగ్రీల సెల్సియస్‌, కనిష్ట ఉష్ణోగ్రతలు 21 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యే అవకాశం ఉంది. రాష్ట్రం లో చలి కాలం మొదలు కావడంతో ఉష్ణోగ్రతలు సైతం పడిపోతున్నాయి. మెదక్‌లో అత్యల్ప ఉష్ణోగ్రత 17.4 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. పటాన్‌చెరులో 18.2 డిగ్రీల సెల్సియస్‌, హైదరాబాద్‌లో కనిష్ట ఉష్ణోగ్రత 20.6గా నమోదైంది.

భద్రాచలంలో గరిష్ట ఉష్ణోగ్రత 33.8 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. ఇది సాధారణ ఉష్ణోగ్రత కంటే చాలా ఎక్కువగా ఉందని IMD పేర్కొంది. 33.5 డిగ్రీల సెల్సియస్‌ నమోదైన హన్మకొండలో సాధారణం కంటే 3.4 డిగ్రీల సెల్సియస్‌ పెరిగింది. ఆగ్నేయ దిశ నుంచి రాష్ట్రం వైపు తక్కువ స్థాయి గాలులు వీస్తున్నాయని IMD తెలిపింది. ఇప్పటికే వర్షం ఎఫెక్ట్ తో ఏపీ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది.

Exit mobile version