Site icon HashtagU Telugu

Omicron Scare : హైద‌రాబాద్‌లో రెండు కంటైన్మెంట్ జోన్లు

Containment Zone

Containment Zone

టోలిచౌకి పారామౌంట్‌ కాలనీలో రెండు ఒమిక్రాన్‌ కేసులు వెలుగు చూసిన నేపథ్యంలో జీహెచ్ఎంసీ, వైద్యారోగ్య శాఖ ఆ ప్రాంతంలో కరోనా ఆంక్షలు విధించాయి. ఒమిక్రాన్‌ కేసులు బయటపడిన వారి నివాసాలకు సమీపంలోని 25ఇళ్ల పరిధిలో కంటైన్‌మెంట్‌ జోన్‌ ఏర్పాటు చేశారు. ఈ నెల 12న కెన్యా, సోమాలియా దేశాల నుంచి నగరానికి వచ్చిన ఇద్దరికి ఒమిక్రాన్‌ నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. వారిని గచ్చిబౌలిలోని టిమ్స్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు.ఒమిక్రాన్‌తో ఉలిక్కిపడ్డ టోలిచౌకి పారామౌంట్ కాలనీలో రంగంలోకి దిగిన 25 హెల్త్ టీమ్స్ 700 ఇళ్లలో కొవిడ్‌ పరీక్షలు చేశారు. మొత్తంగా 136 మందికి RTPCR పరీక్షలు పూర్తి చేశారు. 36 గంటల తర్వాత ఫలితాలు వస్తాయని వైద్యాధికారులు తెలిపారు. ఆర్టీ-పీసీఆర్‌లో పాజిటివ్ వస్తే, నమూనాలను జీనోమ్‌ సీక్వెన్సింగ్‌కి శాంపుల్స్ పంపించాల్సి ఉంటుందన్నారు.

 

Exit mobile version