TRS Party: అలసిపోతోందా? తడబడుతోందా?

ఆవిర్భావ వేడుకల వేళ టీఆర్ఎస్ కు గట్టి సవాళ్లు ఎదురవుతున్నాయి. ఈ నెల 27 నాటికి తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పడి 21 ఏళ్లు పూర్తవుతాయి.

  • Written By:
  • Publish Date - April 17, 2022 / 06:50 PM IST

ఆవిర్భావ వేడుకల వేళ టీఆర్ఎస్ కు గట్టి సవాళ్లు ఎదురవుతున్నాయి. ఈ నెల 27 నాటికి తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పడి 21 ఏళ్లు పూర్తవుతాయి. ఇన్నేళ్లలో ఉద్యమ పార్టీగా 14 ఏళ్ళ పాటు తెలంగాణ కోసం పోరాడింది. మొత్తానికి కోరుకున్న తెలంగాణను సాధించింది. దీంతో ప్రజలు మెచ్చి, నచ్చి అధికారాన్ని అందించారు. అలా 8 ఏళ్లుగా అధికారంలో ఉంది టీఆర్ఎస్. కాని ఇప్పుడు దానికి రాజకీయంగా సమస్యలు తప్పడం లేదు.

కేసీఆర్ మాటలకు తెలంగాణ ప్రజలు ఫిదా అవుతారు. అచ్ఛమైన, స్వచ్ఛమైన తెలంగాణ భాషలో మాట్లాడే కేసీఆర్ కు.. ఏం చెబితే ప్రజలు తన మాట వింటారో బాగా తెలుసు. అందుకే అలానే మాట్లాడతారు. అలాంటి టీఆర్ఎస్ కు తొలిసారిగా ఇబ్బందులు మొదలయ్యాయి. వడ్ల కొనుగోలులో కాని, నిధుల కేటాయింపులో కాని కేంద్రం తమకు న్యాయం చేయడం లేదని టీఆర్ఎస్ ప్రభుత్వం ఆరోపిస్తోంది. దానికోసం పోరాటం చేశామని చెప్పింది. కానీ రాజకీయంగా చూస్తే.. బీజేపీ క్షేత్రస్థాయిలో బలపడుతుండడంతో టీఆర్ఎస్ మరింత ఎక్కువగా పార్టీపై ఫోకస్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది.

వచ్చే ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ ను గెలిపించుకోవడం కేసీఆర్ కు అంత సులభం కాదు అని ప్రతిపక్షాలు అంటున్నాయి. ఎందుకంటే ఇటు కాంగ్రెస్ పార్టీ, అటు బీజేపీ.. రెండూ పోటా పోటీగా ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై చాలా దూకుడుగా పోరాడుతున్నాయి. వాటిని నిలువురిస్తూనే.. టీఆర్ఎస్ బలం పెంచుకునేలా చేయాల్సి ఉంటుంది. కానీ ఇప్పటికే క్షేత్రస్థాయిలో కొందరు టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులపై భారీగా ఆరోపణలు ఉండడంతో.. పార్టీ అధిష్టానానికి ఇబ్బందులు తప్పడం లేదు. సమయానికి ఆదుకుంటాడని భావించిన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా ఇప్పుడు హ్యాండిచ్చేలా కనిపిస్తున్నాడు. ఎందుకంటే.. ఆయన కాంగ్రెస్ పార్టీతో ఒప్పందం చేసుకునే ప్లాన్ లో ఉన్నాడు. దీంతో ఆయన కాని హ్యాండిస్తే.. టీఆర్ఎస్… సోషల్ మీడియా పరంగా కాంగ్రెస్ ను, బీజేపీని ఎదుర్కోవడానికి మరింతగా కష్టపడాల్సి ఉంటుంది. దీనికి పార్టీ హైకమాండ్ ఎలా సిద్ధమవుతుందో చూడాలి.