Site icon HashtagU Telugu

HCA President Tweet: నా స్టేడియంలోకి వ‌చ్చిన సీఎంకు ధ‌న్య‌వాదాలు అని ట్వీట్.. హెచ్‌సీఏ అధ్య‌క్షుడిని ఆడుకుంటున్న నెటిజన్లు..!

HCA President Tweet

Safeimagekit Resized Img (1) 11zon

HCA President Tweet: హెచ్‌సీఏ అధ్య‌క్షుడు జగన్‌మోహన్‌రావు చేసిన ఓ ట్వీట్ (HCA President Tweet) నెటిజ‌న్లుకు ఆగ్ర‌హం తెప్పించింది. శుక్ర‌వారం స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ వ‌ర్సెస్ చెన్నై సూప‌ర్ కింగ్స్ జ‌ట్ల మ‌ధ్య మ్యాచ్ జ‌రిగింది. ఈ మ్యాచ్ చూడ‌టానికి ప్ర‌ముఖ టాలీవుడ్ స్టార్స్‌తో పాటు రాష్ట్ర ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి కూడా కుటుంబ స‌మేతంగా స్టేడియానికి వ‌చ్చారు. ఈ స‌మ‌యంలో సీఎంకు హెచ్‌సీఏ అధికారులు ఘ‌న‌స్వాగ‌తం ప‌లికారు. పూల‌బొకేతో పాటు శాలువా క‌ప్పి సీఎంను స్టేడియంలోకి ఆహ్వానించారు. ఈ స‌మ‌యంలోనే హెచ్‌సీఏ అధ్యక్షుడు జ‌గ‌న్‌మోహ‌న్ రావు చేసిన ఓ ట్వీట్ క్రికెట్ అభిమానుల‌కు కోపం తెప్పించింది. సీఎం రేవంత్ రెడ్డిని స్టేడియంలోకి స్వాగ‌తిస్తూ చేసిన ట్వీట్ ఇప్పుడు తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారింది. హెచ్‌సీఏ అధ్య‌క్ష‌డు చేసిన ట్వీట్ ఏంటంటే.. నా స్టేడియం (ఉప్ప‌ల్‌)కు వ‌చ్చి ఎంతో విలువైన స‌మయాన్ని మాతో గ‌డిపినందుకు సీఎం రేవంత్ రెడ్డి గారికి ధ‌న్యావాదాలు అని రాసుకొచ్చాడు. ఈ ట్వట్ వ‌ల్ల‌నే జ‌గ‌న్ మోహ‌న్ రావు నేడు ట్విట్ట‌ర్‌లో ట్రోల్స్‌కు గురవుతున్నాడు.

ఉప్ప‌ల్ స్టేడియం త‌న స్టేడియం ఎలా అవుతుంద‌ని యూజ‌ర్లు ప్ర‌శ్నిస్తున్నారు. నువ్వు కేవ‌లం హెచ్‌సీఏకి అధ్య‌క్షుడివి మాత్ర‌మే అది గుర్తుపెట్టుకో అని కొంద‌రు జ‌గ‌న్ మోహ‌న్ రావు ట్వీట్‌కు కామెంట్ చేశారు. స్టేడియాన్ని క‌బ్జా చేశావా ఏంటి అని కొంద‌రు ప్ర‌శ్నిస్తున్నారు. మీ స్టేడియం అని త‌ర్వాత రాసుకుందువులే కానీ ముందు కొన్ని నెల‌లు నుంచి పెండింగ్‌లో ఉన్న క‌రెంట్ బిల్లును క‌ట్టు అని ఓ యూజ‌ర్ రాసుకొచ్చాడు. నీ స్టేడియంకి ఇంత‌కీ కరెంట్ బిల్లు క‌ట్టావా..? అని ఒక‌రు ప్ర‌శ్నించారు. నీ స్టేడియం అంటున్నావు కాబ‌ట్టి బ‌కాయి ఉన్న ప‌వ‌ర్ బిల్లు రూ. 1.63 కోట్ల‌ను నువ్వు క‌ట్టు అని కామెంట్స్ చేస్తున్నారు. ఒక్క ఓటుతో గెలిచిన నీకు గ‌త ప్ర‌భుత్వం ఆ స్టేడియం రాసిచ్చిందా..? అని ఒక‌రు కామెంట్ చేశారు. అయితే గ‌త కొన్ని నెల‌లుగా క‌రెంట్ బిల్లు క‌ట్ట‌కుండా ఉండ‌టంతో స‌న్‌రైజ‌ర్స్ వ‌ర్సెస్ చెన్నై మ్యాచ్‌కు ముందు తెలంగాణ విద్యుత్ శాఖ స్టేడియంకు ప‌వ‌ర్ క‌ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే అభిమానుల దృష్ట్యా క‌రెంట్‌ను శుక్ర‌వారం ఒక్క‌రోజు విద్యుత్ శాఖ అందించింది.

Also Read: RR vs RCB: ఐపీఎల్‌లో నేడు మ‌రో ర‌స‌వ‌త్త‌ర పోరు.. ఇరు జ‌ట్ల మ‌ధ్య రికార్డు ఎలా ఉందంటే..?

ఉప్పల్ స్టేడియంలో స‌న్‌రైజ‌ర్స్ గెలుపు

IPL 2024 18వ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 11 బంతులు మిగిలి ఉండగానే 6 వికెట్ల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్‌ను ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూప‌ర్ కింగ్ 20 ఓవ‌ర్ల‌లో 166 ప‌రుగులు చేయ‌గా దీనికి బదులుగా చెన్నై సూప‌ర్ కింగ్స్ జ‌ట్టు మ‌రో 11 బంతులు మిగిలి ఉండ‌గానే ల‌క్ష్యాన్ని సాధించింది.

We’re now on WhatsApp : Click to Join

మ్యాచ్‌కు ముందు ఎమ్మెల్యే దానం నాగేంద‌ర్ కామెంట్స్‌

హైదరాబాద్‌లో క్రికెట్ మ్యాచ్‌కు టిక్కెట్లు దొరకకపోవడానికి HCAనే కారణమ‌ని ఖైర‌తాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద‌ర్ ఆరోపించారు. 10 నిమిషాల్లోనే 45 వేల టిక్కెట్లు ఎలా అమ్ముడుపోతాయ‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. డేవిడ్ వార్నర్‌ ఫిక్సింగ్ చేస్తున్నాడని చెప్పినందుకే సన్ రైజర్స్ టీంలో నుండి త‌న‌ను తీసేశార‌ని ఆరోపించారు. సన్ రైజర్స్ టీంలో ఒక్క తెలుగు ప్లేయర్ లేడు.. సన్ రైజర్స్ టీంలో తెలుగు ప్లేయర్ లేకుంటే ఉప్పల్‌లో మ్యాచ్ ఆడనివ్వను అని దానం నాగేందర్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. హెచ్‌సీఏ అవినీతి బాగా ఎక్కువైంద‌ని ఆయ‌న ఆరోపించారు.