Site icon HashtagU Telugu

Nizamabad : రైతు మహోత్సవ వేడుకల్లో అపశ్రుతి..మంత్రులకు తప్పిన ప్రమాదం

Ministers Safe

Ministers Safe

నిజామాబాద్‌(Nizamabad )లో జరుగుతున్న రైతు మహోత్సవ వేడుకల్లో (Rythu Mahotsava Sabha) ఊహించని ఘటన కలకలం రేపింది. ఈ కార్యక్రమానికి హాజరవుతున్న మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు హెలికాప్టర్ ద్వారా సభా ప్రాంగణానికి చేరుకుంటారని అధికారులకు ముందుగానే సమాచారం అందింది. దీంతో సభా ప్రాంగణానికి కొంత దూరంలో ప్రత్యేక హెలిప్యాడ్‌ను ఏర్పాటు చేశారు. కానీ పైలట్ అనూహ్యంగా హెలికాప్టర్‌(Helipad )ను నేరుగా సభా ప్రాంగణంలోనే దించడంతో అపశ్రుతి చోటుచేసుకుంది.

KTR : కేటీఆర్‌కు హైకోర్టులో ఊరట

హెలికాప్టర్ రెక్కల నుంచి వచ్చిన గాలి వల్ల భారీగా దుమ్ము ఎగసి పడి, సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్వాగత ప్లెక్సీలు నేలకూలిపోయాయి. వేడుకలో పాల్గొన్న ప్రజలు భయాందోళనతో పరుగులు తీశారు. మంత్రులు క్షేమంగా బయటపడటంతో పెను ప్రమాదం తప్పింది. కార్యక్రమం కోసం ఏర్పాటు చేసిన 150 పంట ఉత్పత్తుల ప్రదర్శన స్టాళ్లలో కొన్ని ధ్వంసమయ్యాయి. బందోబస్తు కోసం విధుల్లో ఉన్న కొంతమంది పోలీసులకు స్వల్ప గాయాలైనట్లు తెలుస్తోంది.

Gold ALL TIME RECORD : వామ్మో.. సామాన్యులు బంగారం కొనలేని స్థితికి ధర పెరిగింది

ఇదే తరహాలో ఇటీవల నాగర్‌కర్నూల్ జిల్లాలో కూడా హెలికాప్టర్ ల్యాండింగ్ సందర్భంగా ప్రమాదం తృటిలో తప్పిన ఘటన జరిగింది. భూభారతి చట్టంపై అవగాహన సదస్సుకు వెళ్లిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీ మల్లు రవి, సంపత్‌కుమార్ ప్రయాణించిన హెలికాప్టర్ ల్యాండింగ్ సమయంలో బుల్లెట్ ఫైర్ వల్ల మంటలు చెలరేగాయి. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సమయస్ఫూర్తితో మంటలను అదుపు చేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలు హెలికాప్టర్ ల్యాండింగ్స్ విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరాన్ని వెల్లడిస్తున్నాయి.