Tummala Oath as Telangana Minister : మంత్రి గా ప్రమాణ స్వీకారం చేసిన తుమ్మల

నేడు రోడ్ల , భవనాల శాఖ మంత్రి గా ప్రమాణ స్వీకారం చేసారు

  • Written By:
  • Publish Date - December 7, 2023 / 05:02 PM IST

2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం నుండి కాంగ్రెస్ అభ్యర్థి గా భారీ మెజార్టీ తో విజయడంఖా మోగించిన తుమ్మల నాగేశ్వర్ రావు..నేడు రోడ్ల , భవనాల శాఖ మంత్రి గా ప్రమాణ స్వీకారం చేసారు. 15 నవంబర్ 1953 , గండుగులపల్లి గ్రామం, దమ్మపేట మండలం, ఖమ్మం జిల్లా లో జన్మించారు. పూర్వం ఖమ్మం జిల్లా లోని సత్తుపల్లి, ఖమ్మం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహింఛాడు, అలానే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు మంత్రివర్గంలో, తెలంగాణ రాష్ట్రం లో కేసిఆర్ మంత్రివర్గంలో‌ మంత్రిగా పనిచేసారు.ఖమ్మం జిల్లా తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులుగా పని చేశాడు. 2023 లో బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరాడు.

ఖమ్మం జిల్లా రాజకీయాల్లో తుమ్మలది విశిష్ట స్థానము. రాష్ట్రంలోని ప్రధాన పార్టీని ఒంటిచేత్తో మూడు దశాబ్దాల పాటు ఆయన నడిపించారు. తెలుగుదేశం పార్టీ స్థాపించిన నాటి నుంచి నేటి వరకు ఆయన క్రియాశీలకంగా పనిచేశారు. తన అనుచరులను ఎందరినో నాయకులుగా తీర్చిదిద్దారు. 1982 సెప్టెంబరులో చర్ల మండలం ఏటుపాక గ్రామంలో జరిగిన ఓ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ సమక్షంలో ఆయన పార్టీ సభ్యత్వం తీసుకున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఆయనకు రాజకీయ జన్మనిచ్చింది సత్తుపల్లి నియోజకవర్గం. పూర్వ సత్తుపల్లి నియోజకవర్గంలోని దమ్మపేట మండలం గండుగులపల్లి గ్రామానికి చెందిన ఆయన తన రాజకీయాలను అక్కడి నుంచే ప్రారంభించారు. తెలుగుదేశం స్థాపించిన తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లోనే ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఆయన ఓటమి చవిచూశారు. మళ్లీ ఏడాదిన్నరకే 1985లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో విజయం సాధించారు. అప్పుడే ఆయనకు ఎన్టీఆర్ కేబినెట్ ర్యాంకు ఇచ్చారు. ఆయన 1985,1994,1999,2009 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుండి, 2016లలో తెరాస పార్టీ నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యాడు, 2015లో మండలికి ఎన్నికయ్యాడు.

2004 ఎన్నికల్లో సత్తుపల్లి నియోజకవర్గం నుంచి పోటీచేసి ఓటమి పాలయ్యారు. 2009 ఎన్నికల్లో ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీచేసి గెలుపొందారు. 2014లో జరిగిన ఎన్నికల్లో కూడా టిడిపి నుండి పోటీ చేసి ఓడిపోయాడు. 2014లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరాడు. అనంతరం ఆయనుకు తెరాస పార్టీ ఎమ్మెల్సీగా అవకాశం కల్పించింది. కేసీఆర్ మంత్రివర్గంలో ఆయన ఆర్‌అండ్‌బీ, స్త్రీ, శిశు సంక్షేమశాఖల మంత్రిగా భాద్యతలు నిర్వహించాడు. 2016లో పాలేరు ఉపఎన్నికలో పోటీ చేసి కాంగ్రెస్‌ అభ్యర్థి రాంరెడ్డి సుచరితపై 45,684 ఓట్ల మెజారిటీతో గెలిచాడు. 2018లో జరిగిన ముందస్తు ఎన్నికల్లో పాలేరు నియోజకవర్గం నుండి టిఆర్ఎస్ పార్టీ నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యాడు.

తుమ్మల నాగేశ్వరరావు 2023 సెప్టెంబర్ 14న బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రాజీనామా లేఖను పంపించి హైదరాబాద్ వేదికగా హైదరాబాద్‌లోని తాజ్‌ కృష్ణాలో జరుగుతున్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో పాల్గొనడానికి వచ్చిన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరాడు. 2023 తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో ఖమ్మం నుండి విజయం సాధించారు.

Read Also : Sithakka Oath as Telangana Minister : మంత్రి గా ప్రమాణ స్వీకారం చేసిన సీతక్క