Site icon HashtagU Telugu

Khammam Politics: పువ్వాడ ఎన్నికల అఫిడవిట్ పై ఈసీకి తుమ్మల ఫిర్యాదు

Khammam Politics

Khammam Politics

Khammam Politics: మంత్రి పువ్వాడ అజయ్ అఫిడవిట్ నిబంధనలకు అనుగుణంగా లేదని ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు ఆరోపించారు. ఈ మేరకు అఫిడవిట్ ఫార్మాట్ మార్పుపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశామన్నారు. మీడియాతో తుమ్మల మాట్లాడుతూ.. పువ్వాడ అఫిడవిట్‌ ఫార్మాట్‌లో మార్పుపై ఇప్పటికే రిటర్నింగ్‌ అధికారికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశాను. దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోని రిటర్నింగ్ అధికారి తీరుపై కోర్టుకు వెళతామన్నారు. పువ్వాడ తన అఫిడవిట్‌లోని డిపెండెంట్ కాలమ్‌ను మార్చారు. డిపెండెంట్ కాలమ్‌లో ఎవరూ లేకుంటే నిల్ అని రాయాలి. కానీ అలా రాయలేదని తుమ్మల ఆరోపించారు. ఇంకా తుమ్మల మాట్లాడుతూ.. పువ్వాడ నామినేషన్లలో నాలుగు సెట్లలో తప్పులున్నాయని తెలిపారు. ఈ విషయంలో ఎన్నికల నియమావళిని రిటర్నింగ్ అధికారి పాటించలేదని అసహనం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎన్నికల అధికారిపై న్యాయ పోరాటం చేస్తానని తుమ్మల తెలిపారు.

ఇవాళ ఖమ్మం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమన్వయ సమావేశంలో తుమ్మల పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నా రాజకీయ జీవితంలో ఇంత తీవ్రమైన పోటీ, పోరాటం, పట్టుదల ఉన్న ఎన్నికలను ఎప్పుడూ చూడలేదు. రాష్ట్రమంతా ఒకవైపు, ఖమ్మం జిల్లా ఒకవైపు పక్క రాష్ట్రమైన భీమవరంలో ఖమ్మం ఎన్నికలపై బెట్టింగ్ లు సాగుతున్నాయి. బెట్టింగ్ మంచి సంస్కృతి కాదు. కానీ వందల కోట్ల బెట్టింగ్ లు జరుగుతున్నాయంటే బీఆర్ఎస్ ఫెయిల్ అయినట్లు అర్థమవుతోందని తుమ్మల చెప్పారు. అధికార బీఆర్ఎస్ పార్టీ ఖమ్మం, పాలేరులో వందల కోట్లు కుమ్మరించి నేతలను కొనుగోలు చేస్తోంది. నన్ను, పొంగులేటిని ఓడించేందుకు అధికార యంత్రాంగాన్ని ఉపయోగించుకుంటున్నారు. మీ అరాచకాలన్నీ చక్రవడ్డీతో తిరిగి ఇస్తానని తుమ్మల అన్నారు.

Also Read: Jagadeeshwar Goud : జగదీశ్వర్ గౌడ్