TTDP Alliance : ప్ర‌జా కూటమి దిశ‌గా టీటీడీపీ, కాసానితో `తీన్మార్` మ‌ల్ల‌న్న స్కెచ్!

తెలంగాణ తెలుగుదేశం పార్టీ వినూత్నంగా అడుగులు వేస్తోంది.చిన్నాచిత‌కా పార్టీల‌ను కలుపుకుని(TTDP Alliance)

  • Written By:
  • Publish Date - January 11, 2023 / 03:58 PM IST

తెలంగాణ తెలుగుదేశం పార్టీ వినూత్నంగా అడుగులు వేస్తోంది. ఒక వేళ బీజేపీతో పొత్తు లేక‌పోయిన‌ప్ప‌టికీ చిన్నాచిత‌కా పార్టీల‌ను కలుపుకుని(TTDP Alliance) పూర్వ‌వైభ‌వం కోసం బాట‌లు వేసుకుంటోంది. ఆ దిశ‌గా అధ్య‌క్షుడు కాసాని జ్ఞానేశ్వ‌ర్ ప్ర‌య‌త్నిస్తుంటే, అందుకు అనుగుణంగా చంద్ర‌బాబు ఫోన్ల ద్వారా సంప్ర‌దింపులు జ‌రుపుతున్నారు. తాజాగా చింత‌పండు న‌వీన్ కుమార్ అలియాస్ తీన్మార్ మ‌ల్ల‌న్న(mallanna) కు చంద్ర‌బాబు ఫోన్ చేసిన‌ట్టు పార్టీ వ‌ర్గాల్లోని వినికిడి. నిజామాబాద్ కేంద్రంగా నిర్వ‌హించే టీడీపీ బ‌హిరంగ స‌భ‌కు మ‌ల్ల‌న్న హాజ‌రు కానున్నార‌ని తెలుస్తోంది.

 Also Read : TTDP : చంద్ర‌బాబు నిజామాబాద్ స‌భ‌, కాసాని బ‌స్సు యాత్ర‌!

బేసిక్ గా జ‌ర్న‌లిస్ట్ అయిన చింత‌పండు న‌వీన్ కుమార్ అలియాస్ తీర్మార్ మ‌ల్ల‌న్న(mallanna) ఇటీవ‌ల రాజ‌కీయాల వైపు మ‌ళ్లారు. అధికారంలోని టీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తూ విప‌క్షాలను ఆక‌ర్షించారు. స‌హ‌జంగా ప్ర‌భుత్వం మీద వ్య‌తిరేకంగా ఉండే వాళ్లు మ‌ల్ల‌న్న ప్రోగ్రామ్స్ కు అట్రాక్ట్ అయ్యారు. ఆయ‌న సొంత యూ ట్యూబ్ ఛానల్ ద్వారా తెలంగాణ వ్యాప్తంగా ఒక నెట్ వ‌ర్క్ ను ఏర్పాటు చేశారు. వాళ్ల ద్వారా ప‌లు విధాలుగా స‌మాచారాన్ని సేక‌రిస్తూ టీఆర్ఎస్ నేత‌ల్ని ల‌క్ష్యంగా చేసుకుని దూసుకెళుతున్నారు. ఆ ఛాన‌ల్ ద్వారా వ‌చ్చిన ఫోక‌స్ ద్వారా ఇటీవ‌ల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో గ‌ట్టిపోటీ ఇచ్చారు. ఆయ‌న సామ‌ర్థ్యాన్ని గుర్తించిన టీడీపీ తెలంగాణ విభాగం బాధ్య‌త‌ల‌ను ఇవ్వ‌డానికి ఒకానొక సంద‌ర్భంలో సిద్ధ‌ప‌డింది. కానీ, ఆయ‌న సున్నితంగా తిరస్క‌రించి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.

టీడీపీ ఆఫీస్ కు వెళ్లిన మ‌ల్ల‌న్న స‌న్మానం

జాతీయ పార్టీగా ఉన్న బీజేపీ వాల‌కం న‌చ్చ‌క‌పోవ‌డంతో సొంతంగా 7200 మార్క్ ను పెట్టుకుని కేసీఆర్ ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా పోరాడుతున్నారు. రాబోవు ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌డానికి సిద్ద‌మ‌వుతున్నారు. వెనుక‌బ‌డిన వ‌ర్గాల‌కు రాజ్యాధికారం దిశ‌గా అడుగులు వేస్తున్నారు. తెలంగాణ ఉద్య‌మకారునిగా ప్ర‌యాణం ప్రారంభించి, మీడియా, సోష‌ల్ మీడియా వేదిక‌గా ఫోక‌స్ అయ్యారు. ప్ర‌స్తుతం రాజ‌కీయ‌నాయ‌కునిగా ఎద‌గాల‌ని త‌హ‌త‌హ‌లాడుతున్నారు. అందుకే, ఆయ‌న్ను టీడీపీ తెలంగాణ విభాగం అధ్య‌క్షుడు కాసాని ఆహ్వానించార‌ట‌. ఇటీవ‌ల టీడీపీ ఆఫీస్ కు వెళ్లిన మ‌ల్ల‌న్నను స‌న్మానం జ‌రిగింది. త్వ‌ర‌లో టీడీపీ గూటికి చేర‌బోతున్నార‌ని ఆనాటి నుంచి టాక్ న‌డిచింది.

Also Read : TTDP: టీడీపీ లోకి మాజీ మంత్రి కృష్ణ యాద‌వ్‌?

ప్ర‌స్తుతం టీడీపీ, బీజేపీ పొత్తు అంశం న‌డుస్తోంది. తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజ‌య్ మాత్రం పొత్తు ఉండ‌ద‌ని చెబుతున్నారు. కానీ, అమిత్ షా మాత్రం పొత్తు దిశ‌గా పాజిటివ్ సంకేతాలు ఇస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక వేళ పొత్తు బీజేపీతో లేక‌పోతే, తెలంగాణ వ్యాప్తంగా ఉన్న చిన్న పార్టీల‌ను క‌లుపుకుని పోవాల‌ని కాసాని ప్ర‌య‌త్నం మొద‌లు పెట్టారు. తెలంగాణ జ‌న స‌మితి ప్ర‌స్తుతం కోదండ‌రామిరెడ్డి ఆధ్వ‌ర్యంలో ఉంది. ఆ పార్టీ ఇప్పుడు యాక్టివ్ గా స‌భ్య‌త్వాన్ని ప్రారంభించింది. ఇక 7200 పేరుతో మ‌ల్ల‌న్న ఒక ఉద్య‌మాన్ని న‌డుపుతున్నారు. వెనుక‌బ‌డిన వ‌ర్గాల‌కు రాజ్యాదికారం దిశ‌గా బీఎస్పీ క‌న్వీన‌ర్ ఆర్ ఎస్ ప్ర‌వీణ్ కుమార్ అడుగులు వేస్తున్నారు. ఆ పార్టీ చీఫ్ మాయావ‌తి టీడీపీ చీఫ్ చంద్ర‌బాబుకు క్లోజ్. ఆ సాన్నిహిత్యం పొత్తు దిశ‌గా వెళ్లే అవ‌కాశం లేక‌పోలేదు. ఒక వేళ బీఆర్ఎస్, కమ్యూనిస్ట్ ల మ‌ధ్య పొత్తు కుద‌ర‌క‌పోతే, కామ్రేడ్లు కూడా టీడీపీతో క‌లిసి న‌డిచే అవ‌కాశం ఉంది.

ఉద్య‌మ కారుల‌ను క‌లుపుకుని పెద్ద శ‌క్తిగా(TTDP Alliance)

మొద‌టి ప్రాధాన్యం బీజేపీకి ఇస్తూ ప్ర‌త్యామ్నాయ పొత్తుల ఎత్తుగ‌డ‌ల‌ను తెలంగాణ టీడీపీ వేస్తోంది. క‌త్తికి రెండు వైపులా ప‌దును ఉన్న‌ట్టు టీడీపీ తెలంగాణ విభాగానికి ప్ర‌స్తుతం అనుకూల ప‌రిస్థితులు క‌నిపిస్తున్నాయి. తీర్మార్ మ‌ల్ల‌న్న లాంటి ప్ర‌జా ఉద్య‌మ కారుల‌ను క‌లుపుకుని పెద్ద శ‌క్తిగా(TTDP Alliance) ఎద‌గాల‌ని కాసాని జ్ఞానేశ్వ‌ర్ ప్ర‌య‌త్నిస్తున్నారు. ఇప్ప‌టికే ఆయ‌న‌కు 93 కులాల ప్ర‌తినిధుల‌తో సాన్నిహిత్యం ఉంది. వాళ్లందర్నీ క‌లుపుకుని పోవ‌డంతో పాటు ప్ర‌జా, పౌర‌, ఉద్యమ సంఘాల నేత‌ల‌తో పాటు చిన్నా చిత‌క పార్టీల‌ను టీడీపీ వైపు మ‌ళ్లించే ప్ర‌య‌త్నం జ‌రుగుతోంది. ఆ కోవ‌లోకి తీర్మార్ మ‌ల్ల‌న్న‌తో కాసాని భేటీ వ‌స్తుంద‌ని టీడీపీ వ‌ర్గాల్లోని టాక్‌. అంతేకాదు, స్వ‌యంగా చంద్ర‌బాబు ఫోన్ ద్వారా మ‌ల్ల‌న్నను ఆహ్వానించార‌ని టీడీపీ వ‌ర్గాల్లోని వినికిడి. సో..త్వ‌ర‌లోనే టీడీపీ గూటికి మ‌ల్ల‌న్న చేర‌తార‌ని విస్తృతంగా చ‌ర్చ జ‌రుగుతోంది.

Also Read : TTDP: టీడీపీ వైపు 1983 బ్యాచ్‌, బీసీల‌కు కాసాని గాలం!