TSRTC Special Buses : గణేష్ నిమజ్జనానికి టీఆఎస్ఆర్టీసీ స్పెష‌ల్ బ‌స్సులు.. ఈ రూట్ల‌లో..?

గణేష్ నిమజ్జనం సంద‌ర్భంగా టీఎస్ఆర్టీసీ ప్ర‌త్యేక బ‌స్సుల‌ను న‌డ‌పనుంది.....

Published By: HashtagU Telugu Desk
Tsrtc Buses Imresizer

Tsrtc Buses Imresizer

గణేష్ నిమజ్జనం సంద‌ర్భంగా టీఎస్ఆర్టీసీ ప్ర‌త్యేక బ‌స్సుల‌ను న‌డ‌పనుంది. శుక్రవారం నగరంలో 565 ప్రత్యేక బస్సు సర్వీసులను అందించనుంది. భక్తులు ట్యాంక్ బండ్‌కు చేరుకోవడానికి బస్సులు ఏర్పాటు చేసిన‌ట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. న‌గ‌రంలోని 31 రూట్లలో ఈ స్పెష‌ల్ బ‌స్సులు న‌డ‌వ‌నున్న‌ట్లు అధికారులు తెలిపారు. వీటిలో కొన్ని బషీర్‌బాగ్ నుండి కాచిగూడ, బషీర్‌బాగ్ నుండి రాంనగర్, పాత ఎమ్మెల్యే క్వార్టర్స్ కొత్తపేట, పాత ఎమ్మెల్యే క్వార్టర్స్ నుండి ఎల్ బి నగర్, ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుండి వనస్థలిపురం, ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుండి మిధాని, టిటిడి కల్యాణ మండపం, లిబర్టీ నుండి ఉప్పల్, ఇందిరా పార్క్ నుండి ఉప్పల్, ఇందిర. పార్క్ నుండి సికింద్రాబాద్ స్టేషన్, ఇందిరా పార్క్ నుండి రిసాలా బజార్, ఇందిరా పార్క్ నుండి ECIL క్రాస్‌రోడ్స్, ఇందిరా పార్క్ నుండి సికింద్రాబాద్ స్టేషన్, ఇందిరా పార్క్ నుండి జాంబాగ్, లక్డికాపుల్ నుండి టోలీచౌకి, లక్డికాపూల్, ఖైర‌తాబాద్‌ నుండి BHEL, బీహెచ్ఈఎల్ నుండి మెహ‌దీప‌ట్నంకి బ‌స్సు స‌ర్వీసులు న‌డ‌వ‌నున్నాయి. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా ఈ సర్వీసులు నడవ‌నున్న‌ట్లు అధికారులు తెలిపారు. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల సలహా మేరకు . ఎన్టీఆర్ మార్గ్, గాంధీ మార్గ్ అవుట్‌పోస్ట్, మెట్రో కంట్రోల్ రూమ్‌ల వ‌ద్ద టీఎస్ఆర్టీసీ ఇన్ఫర్మేషన్ కియోస్క్‌లను ఏర్పాటు చేసింది

  Last Updated: 09 Sep 2022, 07:24 AM IST