TSRTC: రాఖీ పండగ సందర్భంగా 3 వేల ప్రత్యేక బస్సులను నడపనున్న టీఎస్‌ఆర్టీసీ

రాఖీ పౌర్ణమి సందర్భంగా ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను టీఎస్‌ఆర్టీసీ (TSRTC) ఎండీ సజ్జనార్‌ ఆదేశించారు.

  • Written By:
  • Publish Date - August 27, 2023 / 06:37 AM IST

TSRTC: రాఖీ పౌర్ణమి సందర్భంగా ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను టీఎస్‌ఆర్టీసీ (TSRTC) ఎండీ సజ్జనార్‌ ఆదేశించారు. రక్షాబంధన్‌కు రాష్ట్రవాప్తంగా 3 వేల ప్రత్యేక బస్సులను నడిపించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ ప్రత్యేక సర్వీసులను ఈ నెల 29, 30, 31 తేదీల్లో ప్రతి రోజూ వెయ్యి బస్సుల చొప్పున నడపనున్నట్లు పేర్కొన్నారు. రాఖీ పౌర్ణమికి ప్రత్యేక బస్సుల ఏర్పాటు, ప్రయాణికులకు కల్పించాల్సిన సౌకర్యాలపై అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సజ్జనార్‌ సమీక్షించారు.

హైదరాబాద్ నుంచి కరీంనగర్, నిజామాబాద్, హన్మకొండ, ఖమ్మం, నల్లగొండ, మహబూబ్ నగర్, గోదావరిఖని, మంచిర్యాల, ఏటీసీ వెళ్లే రూట్లలో ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తున్న‌ట్టు తెలిపారు. ఉప్పల్, ఎల్బీనగర్, ఆరాంఘర్, జేబీఎస్, ఎంజీబీఎస్ తదితర ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలను మోహరించారు.

Also Read: Chandrayaan-3 : చంద్రమండలంలో దందా ఎట్లా చేయాలనీ కేసీఆర్ ఆలోచిస్తున్నాడు – బండి సంజయ్

గత ఏడాది రక్షా బంధన్ సందర్భంగా ఆర్టీసీకి ఒకే రోజు రూ.20 కోట్ల ఆదాయం సమకూరింది. మొత్తం ఆక్యుపెన్సీ రేటు 87 శాతంగా నమోదు కాగా, 12 బస్ డిపోల్లో 100 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ ఒక్క రోజులో ఇంతమొత్తంలో ఆదాయం రాలేదని చెప్పారు. గత ఏడాది స్పూర్తితో ఈ రాఖీ పౌర్ణమి నాడు కూడా అలాగే పనిచేయాలన్నారు. రిజర్వేషన్ కోసం www.tsrtconline.in లేదా 040-69440000 లేదా 040-23450033 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.