Site icon HashtagU Telugu

TSRTC: TSRTC బస్సే కాదు… ఆసుపత్రి కూడా మనందరిది

Tsrtchospital Imresizer

Tsrtchospital Imresizer

TSRTC ఎండీగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన‌ప్ప‌టి నుంచి స‌జ్జ‌నార్ త‌న‌దైన శైలిలో ఆర్టీసీని అభివృద్ధి చేస్తోన్నారు. ఇటీవ‌ల‌ బతుకమ్మ, దసరా సంబరాలు నేప‌థ్యంలో ఈ నెల 24 నుంచి వచ్చే నెల 5వ తేదీ వరకు భారీగా స్పెషల్ బస్సులు నడిపిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే.

TSRTC ఎండీ సజ్జనార్ తన మార్క్‌ను మ‌రోసారి చూపించారు. ఇప్పటికే పలు నిర్ణయాలతో సామాన్య ప్రజల నుంచి ప్రశంసలు అందుకున్నారు. తాజాగా తార్నాకలోని TSRTC హాస్పిటల్‌లో ఇప్పుడు సామాన్య ప్రజలకు అతి తక్కువ ఖర్చుతో వైద్య సేవలు అందించనున్నట్లు వెల్లడించారు. ఇప్పుడు TSRTC బస్సే కాదు.. ఆసుపత్రి కూడా మనందరిది అని సజ్జనార్ తెలిపారు. తక్కువ ఖర్చుతో వైద్య సేవలు అందిస్తున్న‌ట్లు TSRTC అధికార‌క ట్విట్ట‌ర్‌లో ట్వీట్ చేసింది. ప్ర‌యాణికులు, హైద‌రాబాద్‌లో ఉండే ప్ర‌జ‌లు ఈ అవ‌కాశాన్ని క‌చ్చితంగా వాడుకోవాల‌ని స‌జ్జ‌నార్ సూచించారు. ప్ర‌త్యేక‌మైన అపాయిట్‌మెంట్ కోసం 9154298817 నెంబ‌ర్‌ను సంప్ర‌దించాల‌ని ట్వీట్‌లో తెలిపారు.