Sajjanar: RRR మూవీ యూనిట్ కోసం TSRTC ప్రత్యేక బస్సులు

  • Written By:
  • Updated On - March 24, 2022 / 11:16 PM IST

ట్రెండ్‌కు తగ్గట్టు మారితే ఫలితాలు వాటంతట అవే వస్తాయి. ఈ విషయాన్ని తెలంగాణ ఆర్టీసీ సంస్థ నిరూపిస్తోంది. ఆర్టీసీ ఎండీగా సజ్జనార్ ఎంపికైనప్పట్నుంచి ప్రజలకు మరింత చేరువై లాభాల బాట పట్టింది. తాజాగా భారత సినీ పరిశ్రమలో అత్యంత క్రేజ్‌ సొంతం చేసుకున్న , అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న RRR మూవీకి తమకు తగ్గట్టుగా ప్రమోషన్స్‌కు వాడుకుంటూ ఆకట్టుకుంది. అంతే కాదు వారికి తమదైన రీతిలో కృతజ్ఞతలు చెప్పింది.

శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా RRR చిత్రం విడుదల కాబోతోంది. మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా చిత్రాన్ని వీక్షించేందుకు తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్లకు ఆ చిత్రయూనిట్ వెళ్ళబోతోంది. దీంతో తెలంగాణకు సంబంధించి RRR మూవీ బృందం కోసం ఆర్టీసీ సంస్థ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. దీనిపై స్పందించిన RRR మూవీ నిర్మాతలు ట్విట్టర్ వేదికగా టీఎస్‌ఆర్టీసీ ఎండి సజ్జనార్‌కు కృతజ్ఞతలు చెప్పారు. తమ చిత్ర బృందానికి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు చెబుతూ ట్వీట్ చేశారు. భవిష్యత్తులోనూ టీఎస్‌ఆర్టీసీ ఇదే విధమైన సహకారం అందించాలని ఆకాంక్షించారు. సజ్జనార్ ఎండీగా బాధ్యతలు తీసుకున్న తర్వాత టీఎస్‌ఆర్టీసీ తమ ప్రమోషన్స్‌ ద్వారా ప్రజలకు మరింత చేరువైంది.

ట్రెండ్‌కు తగ్గట్టు ప్రజల అభిరుచులను గమనించి ప్రస్తుతం ప్రచార చిత్రాలను చేస్తోంది. అది కూడా ఎటువంటి ఖర్చు లేకుండా నే చేస్తోంది. ఇక తమ కు సంబంధించిన వాటి కోసం క్రేజీ నటులను కూడా ప్రచారకర్తగా వాడేస్తోంది. ఇటీవలే RRR సినిమాకు సంబంధించి ప్రచారాన్ని కూడా బాగా వాడేసుకుంది. ఆ సినిమా నుంచి విడుదలైన “ఎత్తరా జెండా” ఈ పాటని ఆర్టీసీ బాగా ఉపయోగించుకుంది. ఆర్ఆర్ ఆర్ మూవీ టైటిల్ అర్థం వచ్చేలా ఆర్టీసీ తమ పబ్లిసిటీ చేసుకుంది. RRR అంటే..”రాష్ట్ర రోడ్డు రవాణా”కంటూ సరికొత్త అర్థాన్ని తెచ్చిపెట్టింది. ఇక ఈ పాటలో జెండా పై కెత్తి వందేమాతరం అని చెబుతూ ఉంటారు.. కానీ సజ్జనార్ చేసిన ట్వీట్ లో మాత్రం.. వందేమాతరం స్థానంలో టిఆర్ఎస్ జండా లోగోను బస్సు గుర్తులను ఉంచారు. ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సజ్జనార్ చేసిన ఈ ప్రయోగం అటు RRR చిత్ర బృందానికి కూడా మంచి పబ్లిసిటీ తీసుకొచ్చిందనే చెప్పాలి.