Medaram: మేడారం జాతరకు TSRTC ప్రత్యేక బస్సులు.. వివరాలు ఇదిగో

  • Written By:
  • Updated On - February 15, 2024 / 08:05 PM IST

తెలంగాణ కుంభమేళా మేడారం మహాజాతరకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఈసారి ఏకంగా 51 సెంటర్ల నుంచి ఆరు వేలకు పైగా బస్సులు నడిపేందుకు కసరత్తు చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 51 సెంటర్ల నుంచి మేడారం ప్రత్యేక బస్సులు నడిపించనున్నారు. అందులో ఉమ్మడి వరంగల్ లోనే 22 సెంటర్లుండగా.. వరంగల్ నగరంలోని మూడు ప్రాంతాల నుంచి బస్సులు నడపనున్నారు. ఈ మేరకు మేడారం జాతరకు రాకపోకలు సాగించేందుకు ఆర్టీసీ అధికారులు ఛార్జీలు కూడా నిర్ణయించారు. ఆర్టీసీ బస్సుల్లో మహాలక్ష్మీ స్కీం మేరకు మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించనున్నారు. ఇక పురుషుల కోసం ఆర్టీసీ అధికారులు ఛార్జీలు విడుదల చేశారు. అధికారులు విడుదల చేసిన మేరకు బస్సులు నడిపే సెంటర్, కిలోమీటర్లు, పెద్దలు, చిన్నారులకు సంబంధించిన ఛార్జీల వివరాలు ఇలా ఉన్నాయి.

1.హనుమకొండ నుంచి మేడారం జాతర 110 కిలోమీటర్లు ఉండగా.. పెద్దలకు ఛార్జీ 250, చిన్నారులకు 140 గా బస్ ఛార్జీ నిర్ణయించారు
2. కాజీపేట నుంచి మేడారం జాతర 110 కిలోమీటర్లు.. పెద్దల ఛార్జీ: 250, చిన్నారుల ఛార్జీ: 140
3. వరంగల్ నుంచి మేడారం జాతర 110 కిలోమీటర్లు.. పెద్దల ఛార్జీ: 250, చిన్నారుల ఛార్జీ: 140
4. జనగామ నుంచి మేడారం జాతర 165 కిలోమీటర్లు.. పెద్దల ఛార్జీ: 370, చిన్నారుల ఛార్జీ: 210
5. హైదరాబాద్ నుంచి మేడారం 259 కిలోమీటర్లు.. పెద్దల ఛార్జీ: 550, చిన్నారుల ఛార్జీ: 310
6. హైదరాబాద్ పరిధిలోని మిగతా ప్రాంతాల నుంచి మేడారం 274 కిలోమీటర్లు.. పెద్దల ఛార్జీ: 600, చిన్నారుల ఛార్జీ: 320
7. స్టేషన్ ఘన్ పూర్ నుంచి మేడారం జాతర 140 కిలోమీటర్లు.. పెద్దల ఛార్జీ: 300, చిన్నారుల ఛార్జీ: 180
8. నర్సంపేట నుంచి మేడారం జాతర 107 కిలోమీటర్లు.. పెద్దల ఛార్జీ: 250 , చిన్నారుల ఛార్జీ: 150
9. కొత్తగూడ నుంచి మేడారం జాతర 137 కిలోమీటర్లు.. పెద్దల ఛార్జీ: 300, చిన్నారుల ఛార్జీ: 170
10. పరకాల నుంచి మేడారం జాతర 107 కిలోమీటర్లు.. పెద్దల ఛార్జీ: 250, చిన్నారుల ఛార్జీ: 140

11. చిట్యాల నుంచి మేడారం జాతర 115 కిలోమీటర్లు.. పెద్దల ఛార్జీ: 250 , చిన్నారుల ఛార్జీ: 140
12. మహబూబాబాద్ నుంచి మేడారం జాతర 155 కిలోమీటర్లు.. పెద్దల ఛార్జీ: 350 , చిన్నారుల ఛార్జీ: 190
13. గూడూరు నుంచి మేడారం జాతర 125 కిలోమీటర్లు.. పెద్దల ఛార్జీ: 280 , చిన్నారుల ఛార్జీ: 160
14. తొర్రూరు నుంచి మేడారం జాతర 165 కిలోమీటర్లు.. పెద్దల ఛార్జీ: 350 , చిన్నారుల ఛార్జీ: 190
15. వర్ధన్నపేట నుంచి మేడారం జాతర 133 కిలోమీటర్లు.. పెద్దల ఛార్జీ: 300, చిన్నారుల ఛార్జీ: 160
16. ఆత్మకూరు నుంచి మేడారం జాతర 90 కిలోమీటర్లు.. పెద్దల ఛార్జీ: 210 , చిన్నారుల ఛార్జీ: 120
17. మల్లంపల్లి నుంచి మేడారం జాతర 75 కిలోమీటర్లు.. పెద్దల ఛార్జీ: 180 , చిన్నారుల ఛార్జీ: 110
18. ములుగు నుంచి మేడారం జాతర 60 కిలోమీటర్లు.. పెద్దల ఛార్జీ: 150, చిన్నారుల ఛార్జీ: 90
19. భూపాలపల్లి నుంచి మేడారం జాతర 100 కిలోమీటర్లు.. పెద్దల ఛార్జీ: 220, చిన్నారుల ఛార్జీ: 130

20. ములుగు గణపురం నుంచి మేడారం జాతర 80 కిలోమీటర్లు.. పెద్దల ఛార్జీ: 200 , చిన్నారుల ఛార్జీ: 110
21. జంగాలపల్లి నుంచి మేడారం జాతర 55 కిలోమీటర్లు.. పెద్దల ఛార్జీ: 150 , చిన్నారుల ఛార్జీ: 90
22. పస్రా నుంచి మేడారం జాతర 30 కిలోమీటర్లు.. పెద్దల ఛార్జీ: 80 , చిన్నారుల ఛార్జీ: 50
23. గోవిందరావుపేట నుంచి మేడారం జాతర 35 కిలోమీటర్లు.. పెద్దల ఛార్జీ: 100 , చిన్నారుల ఛార్జీ: 60
24. తాడ్వాయి నుంచి మేడారం జాతర 16 కిలోమీటర్లు.. పెద్దల ఛార్జీ: 60 , చిన్నారుల ఛార్జీ: 40