Site icon HashtagU Telugu

TSRTC : ఎన్నికల వేళ ఓటర్ల కోసం టీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు

Jpeg Optimizer 1370621 Tsrtc1

Jpeg Optimizer 1370621 Tsrtc1

TSRTC :  మే 13న రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈసందర్భంగా ఓటు వేసేందుకు తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లే వారి కోసం టీఎస్ ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం ఏపీ రూట్లలో సరిపడా బస్సులను నడిపేందుకు ప్రణాళికను రెడీ చేసుకుంది. ఓటు వేసేందుకు ఏపీకి వెళ్లే వారి రద్దీ ఇప్పటికే పెరిగిందని.. వచ్చే రెండు రోజుల్లో బస్సుల్లో ప్రయాణికుల సంఖ్య మరింత పెరుగుతుందని టీఎస్ ఆర్టీసీ అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రత్యేకించి హైదరాబాద్‌, రంగారెడ్డి పరిసరాల్లో స్థిరపడిన చాలా మంది ఏపీవాసులు ఓటు వేసేందుకు సొంతూళ్లకు వెళ్తారని భావిస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join

ట్రైన్ టికెట్లు దొరకడం కష్టతరంగా మారిన ప్రస్తుత పరిస్థితుల్లో బస్సుల్లో రాకపోకలు సాగించేందుకే ఎక్కువ మంది మొగ్గుచూపొచ్చని అంచనా వేస్తున్నారు. అందుకే హైదరాబాద్‌లో నడిపే కొన్ని సిటీ బస్సులను కూడా ఏపీ రూట్లలో నడపాలని టీఎస్ ఆర్టీసీ అధికారులు యోచిస్తున్నారు. ప్రత్యేకించి మే 13వ తేదీన తెల్లవారుజాము నుంచి అర్ధరాత్రి వరకు బస్సు సౌకర్యాన్ని అందుబాటులోకి తేవాలని భావిస్తున్నారు. టీఎస్‌ఆర్టీసీ రోజూ నడిపే 3,450 బస్సులకు అదనంగా వెయ్యికిపైగా బస్సులను ఎన్నికల వేళ ప్రజల సౌకర్యం కోసం సిద్ధంగా ఉంచుతోంది. అదనంగా నడిపే 200 బస్సుల్లో రిజర్వేషన్‌ సౌకర్యం కల్పిస్తున్నామని ఇప్పటికే ఆర్టీసీ అధికారులు అనౌన్స్ చేశారు.

Also Read : Ranveer Singh : ఇన్‌స్టాగ్రామ్‌లో పెళ్లి ఫోటోలు తీసేసిన రణ్‌వీర్.. కారణం ఏంటి..?

టీఎస్ ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్‌న్యూస్ చెప్పింది. ఎక్స్‌‌ప్రెస్‌ బస్సుకు సంబంధించి మంత్లీ సీజన్‌ పాస్‌ కలిగి ఉన్న వారు డీలక్స్‌ బస్సుల్లోనూ ప్రయాణించే వెసులుబాటును కల్పించింది. రూ.20 కాంబినేషన్‌ టికెట్‌ తీసుకుని డీలక్స్‌ బస్సుల్లో వారు ప్రయాణించవచ్చని వెల్లడించింది. ఎక్స్‌‌ప్రెస్‌ పాస్‌ ఉన్న వారికే ఈ సదుపాయం వర్తిస్తుంది. 100 కి.మీ పరిధిలో జారీ చేసే ఈ-పాస్‌ కావాలనుకునే వారు టీఎస్‌ ఆర్టీసీ బస్‌‌పాస్‌ కౌంటర్లలో సంప్రదించొచ్చు.  ఓ వైపు మహిళలకు ఉచిత ప్రయాణాన్ని అందిస్తున్న టీఎస్ ఆర్టీసీ.. మరోవైపు ఇలాంటి స్కీంలతో ప్రయాణికులకు మరింత చేరువ అవుతోంది.

Also Read : Political Giants : మహామహులనూ వదలని ఓటమి.. ఎన్నికల్లో ఎవరైనా ఒకటే !